Naga Chaitanya – Samantha : ఆ సిరీస్‌తోనే విడిపోయారు అంటూ రూమర్స్.. కానీ అదే ఇష్టమంటున్న నాగచైతన్య!

ఇప్పటివరకు విడాకుల విషయంలో సైలెంట్ గా ఉన్న నాగచైతన్య కొన్ని రోజులు నుంచి ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నాడు. తాజాగా వీరిద్దరూ విడిపోడానికి ఆ సిరీసే..

Naga Chaitanya – Samantha : ఆ సిరీస్‌తోనే విడిపోయారు అంటూ రూమర్స్.. కానీ అదే ఇష్టమంటున్న నాగచైతన్య!

Naga Chaitanya comments on Samantha The Family Man series

Updated On : May 11, 2023 / 1:19 PM IST

Naga Chaitanya – Samantha : నాగచైతన్య నటించిన సినిమా కస్టడీ (Custody) రిలీజ్ సిద్దమవుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ మూవీ ప్రమోషన్స్ లో పాల్గొంటున్న చైతన్య.. వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలోనే తన విడాకుల విషయం గురించి మొదటిసారి పూర్తిగా ఓపెన్ అయ్యి కామెంట్స్ చేస్తున్నాడు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో వచ్చే వార్తలు వల్లే వారిద్దరూ విడిపోవాల్సి వచ్చింది అంటూ చెప్పుకొచ్చిన నాగచైతన్య.. సమంత చాలా మంచి అమ్మాయి అంటూ, తను ఎప్పుడు సంతోషంగా ఉండాలంటూ చేసిన కామెంట్స్ బాగా వైరల్ అయ్యాయి.

Naga Chaitanya : అయిపోయి సంవత్సరం అవుతుంది.. అయినా.. మొదటిసారి విడాకుల రూమర్స్ గురించి పూర్తిగా ఓపెన్ అయిన నాగ చైతన్య..

తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మరో ఆసక్తికర విషయాన్ని బయట పెట్టాడు. మజిలీ సినిమా తరువాత సమంత నటించిన సినిమాల్లో మీకు ఏదంటే ఇష్టం అని ప్రశ్నించగా, నాగచైతన్య బదులిస్తూ.. ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ (The Family Man) అంటే బాగా ఇష్టమని, ఆ తరువాత ‘ఓ బేబీ’ సినిమా అంటే ఇష్టమని చెప్పుకొచ్చాడు. అలాగే ఇప్పటికి తన ప్రతి మూవీ చూస్తాను అని కూడా తెలియజేశాడు. కాగా వీరిద్దరి మధ్య విబేధాలు రావడానికి కారణం ఫ్యామిలీ మ్యాన్ సిరీసే కారణమంటూ అప్పటిలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

Naga Chaitanya : ఆ విషయంలో మా నాన్న తప్పేమి లేదు.. నాగార్జున పై నాగచైతన్య కామెంట్స్!

ఇప్పుడు నాగచైతన్య ఆ సిరీసే తనకి ఇష్టమంటూ చెప్పడంతో ఆ వార్తలన్నీ ఫేక్ అని తెలిసిపోయింది. ఇక ఇదే ఇంటర్వ్యూలో సమంత వర్క్ గురించి మాట్లాడుతూ.. “తన చాలా హార్డ్ వర్కర్ అని, ఏదైన అనుకుంటే దాని కోసం ఎంత దూరం అయినా వెళ్తుందని” చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కాగా కస్టడీ సినిమా రేపు (మే 12) ఆడియన్స్ ముందుకు రాబోతుంది. బై లింగువల్ గా తెరకెక్కిన ఈ సినిమాతో చైతన్య తమిళ్ డెబ్యూట్ ఇవ్వబోతున్నాడు.