Custody Review : కస్టడీ ట్విట్టర్ రివ్యూ.. చైతూ కెరీర్ లో బెస్ట్ సినిమా అవుతుందట..

కస్టడీ సినిమా ఇప్పటికే ఓవర్సీస్ లో ప్రీమియర్ షోలు పడ్డాయి. ఇక్కడ కూడా కొన్ని చోట్ల ఎర్లీ మార్నింగ్ షోలు పడ్డాయి. కస్టడీ సినిమా చూసిన ప్రేక్షకులు, అభిమానులు తమ రివ్యూలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంటున్నారు.

Custody Review : కస్టడీ ట్విట్టర్ రివ్యూ.. చైతూ కెరీర్ లో బెస్ట్ సినిమా అవుతుందట..

Naga Chaitanya Custody Movie Twitter Review and audience ratings and reviews

Updated On : May 12, 2023 / 10:35 AM IST

Custody Review :  నాగచైతన్య(Naga Chaitanya), కృతిశెట్టి(Krithi Shetty) జంటగా వెంకట్ ప్రభు(Venkat Prabhu) దర్శకత్వంలో తెరకెక్కిన కస్టడీ(Custody) సినిమా నేడు మే 12న గ్రాండ్ గా రిలీజ్ అయింది. టీజర్, ట్రైలర్, సాంగ్స్ తో సినిమాపై ముందే అంచనాలు నెలకొన్నాయి. చిత్ర యూనిట్ కూడా ప్రమోషన్స్ భారీగానే చేశారు. చైతూ, కృతి శెట్టి గత సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో ఈ సినిమా హిట్ కొట్టాలని ఫిక్స్ అయ్యారు. తెలుగు, తమిళ్ లో ఈ సినిమా రిలీజయింది.

ఇక కస్టడీ సినిమా ఇప్పటికే ఓవర్సీస్ లో ప్రీమియర్ షోలు పడ్డాయి. ఇక్కడ కూడా కొన్ని చోట్ల ఎర్లీ మార్నింగ్ షోలు పడ్డాయి. కస్టడీ సినిమా చూసిన ప్రేక్షకులు, అభిమానులు తమ రివ్యూలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంటున్నారు. సినిమా యాక్షన్ సీన్స్ అదిరిపోయాయి అంటున్నారు, సెకండ్ హాఫ్ అయితే చాలా ఇంప్రెసివ్ గా ఉందని అంటున్నారు, చైతూ కేరీర్ లో బెస్ట్ సినిమా అవుతుందని అంటున్నారు. సినిమాలో సర్ ప్రైజ్ లు కూడా బాగున్నాయట. అక్కడక్కడా లవ్ సీన్స్ మాత్రం కొంచెం స్లోగా ఉన్నాయి అంటున్నారు. మొత్తానికి అన్ని చోట్లా పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి కస్టడీ సినిమాకు. మరి చైతన్య కస్టడీతో ఏ రేంజ్ లో హిట్ కొడతాడో చూడాలి.