Nagarjuna: ఇలాంటి సత్కారం అందడం మొదటిసారి.. చాలా ఆనందంగా ఉంది.. అలయ్ బలయ్ కార్యక్రమంపై నాగార్జున ప్రశంసలు
దసరా పండుగ సందర్బంగా "అలయ్ బలయ్" 2025 ఉత్సవం ఈ రోజు(Nagarjuna) ఘనంగా జరగనుంది. మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ అధ్వర్యంలో "అలయ్ బలయ్" ఫౌండేషన్ ప్రతీఏటా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.

Nagarjuna expresses joy over attending Alai Balai 2025 event
Nagarjuna: దసరా పండుగ సందర్బంగా “అలయ్ బలయ్” 2025 ఉత్సవం ఈ రోజు ఘనంగా జరగనుంది. మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ అధ్వర్యంలో “అలయ్ బలయ్” ఫౌండేషన్ ప్రతీఏటా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమ 20వ సంవత్సరాల(Nagarjuna) ఉత్సవం, తెలంగాణ సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రదర్శిస్తూ, జాతీయ వీరులకు గౌరవం అందిస్తూ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ఘనంగా జరగనుంది.
Kantara Chapter 1: నిజమైన మాస్టర్ పీస్.. కాంతార: ఛాప్టర్ 1 సినిమాపై ప్రభాస్, సందీప్ ప్రశంసలు
ఈ కార్యక్రమానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సూఖ్ మండవియా, కేంద్ర గనులు, కట్టడాల మంత్రి జి.కిషన్ రెడ్డి చీఫ్ గెస్ట్‌లుగా హాజరుకానున్నారు. అయితే ఈ వేడుకకు తనకు కూడా ఆహ్వానం అందడంపై ఆనందం వ్యక్తం చేశారు సినీ హీరో అక్కినేని నాగార్జున.
ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. ఇలాంటి సత్కారం చేయించుకోవడం నాకు మొదటిసారి. కాస్త కొత్తగా అనిపిస్తోంది. బండారు దత్తాత్రేయ గారు గత 20 ఏళ్లుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అన్ని రంగాల నుంచి ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. అంతమంది రాజకీయ నాయకులు, ప్రముఖులు ఒకే వేదిక మీదకు రావడం మాకు ఎంతో ధైర్యాన్నిస్తుంది. ఇలాంటి గొప్ప కార్యక్రమాన్ని చేపట్టడం నిజంగా అభినందనీయం. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న విజయలక్ష్మి గారికి నా అభినందనలు. అలాగే ఇలాంటి గొప్ప కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు కృతజ్ఞతలు. అంటూ చెప్పుకోచ్చాడు.