Nagarjuna : శేఖర్ కమ్ముల – ధనుష్ సినిమాలో నాగార్జున గెస్ట్ అప్పీరెన్స్?

ధనుష్ హీరోగా తెలుగులో మంచి క్లాస్ సినిమాలు అందించే దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సినిమా గతంలోనే అనౌన్స్ చేశారు. ఈ సినిమా పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ LLP బ్యానర్ పై ఆసియన్ సునీల్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

Nagarjuna : శేఖర్ కమ్ముల – ధనుష్ సినిమాలో నాగార్జున గెస్ట్ అప్పీరెన్స్?

Nagarjuna will play a guest role in Sekhar Kammula and Dhanush Movie

Updated On : July 27, 2023 / 6:30 AM IST

Dhanush :  ఇటీవల తమిళ హీరోలంతా తెలుగులో, తెలుగు డైరెక్టర్స్ తో సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే విజయ్, శివ కార్తికేయన్, విష్ణు విశాల్, ధనుష్ ఇలా.. తమిళ్ హీరోలంతా తెలుగులో సినిమాలు చేస్తున్నారు. తమిళ్ స్టార్ హీరో ధనుష్ తెలుగులో డైరెక్టర్ వెంకీ అట్లూరితో ‘సర్’ సినిమా చేసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి వంద కోట్లకు పైగా కలెక్షన్స్ తెచ్చుకున్నారు. ప్రస్తుతం ధనుష్ కెప్టెన్ మిల్లర్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత తన సొంత దర్శకత్వంలో ధనుష్ 50వ సినిమా తెరకెక్కనుంది.

ధనుష్ హీరోగా తెలుగులో మంచి క్లాస్ సినిమాలు అందించే దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సినిమా గతంలోనే అనౌన్స్ చేశారు. ఈ సినిమా పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ LLP బ్యానర్ పై ఆసియన్ సునీల్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. కానీ ఈ సినిమా అనేక కారణాలతో వాయిదా పడుతూ వస్తుంది. ఇప్పుడు త్వరలోనే ఈ సినిమాని పట్టాలెక్కించబోతున్నారని సమాచారం.

Vishwaksen : బేబీ మూవీ డైరెక్టర్ సాయి రాజేష్‌తో వివాదం పై మీడియా ముందు మాట్లాడిన విశ్వక్ సేన్..

ఇప్పటికే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ కూడా అయిపోయినట్టు తెలుస్తుంది. తాజాగా ఈ సినిమా గురించి ఓ అప్డేట్ టాలీవుడ్ లో వినిపిస్తుంది. శేఖర్ కమ్ముల – ధనుష్ సినిమాలో టాలీవుడ్ కింగ్ నాగార్జున ఓ ముఖ్య పాత్ర పోషిస్తారని సమాచారం. ఇప్పటికే నాగార్జున కూడా ఓకే చెప్పినట్టు తెలుస్తుంది. గతంలో నాగ్ ఆల్రెడీ తమిళ హీరో కార్తీతో ఊపిరి సినిమా ఏటీసీ విజయం సాధించాడు. మరి ఇప్పుడు ధనుష్ సినిమాలో ఎలాంటి క్యారెక్టర్ తో మెప్పిస్తారో చూడాలి.