Unstoppable : పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి ఫ్లాప్ గురించి బాలయ్య అన్‌స్టాపబుల్‌లో ప్రస్తావన..
బాలకృష్ణ మీ లైఫ్ లో అన్‌స్టాపబుల్ మూమెంట్ ఏంటి అని నిర్మాత నాగవంశీని అడిగారు.

Nagavamshi Comments on Pawan Kalyan Agnyaathavaasi Movie in Balakrishna Unstoppable Show
Unstoppable : బాలకృష్ణ హోస్ట్ గా అన్‌స్టాపబుల్ సీజన్ 4 ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. నేడు దీపావళి సందర్భంగా రెండో ఎపిసోడ్ రిలీజ్ అయింది. ఈ ఎపిసోడ్ లో లక్కీ భాస్కర్ టీమ్ తరపున దుల్కర్ సల్మాన్, వెంకీ అట్లూరి, నాగవంశీ, మీనాక్షి చౌదరి గెస్టులుగా వచ్చారు. ఈ ఎపిసోడ్ లో లక్కీ భాస్కర్ మూవీ టీమ్ బోలెడన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
ఈ క్రమంలో బాలకృష్ణ మీ లైఫ్ లో అన్‌స్టాపబుల్ మూమెంట్ ఏంటి అని నిర్మాత నాగవంశీని అడిగారు. దీనికి నాగవంశీ స్పందిస్తూ.. 2018లో బాగా అంచనాలు ఉన్న సినిమా ఫ్లాప్ అయింది. దాంతో ఆ తర్వాత ఏమవుతుంది, ఎటు వెళ్తుంది అని ఫీల్ అయ్యాను. అప్పుడు త్రివిక్రమ్ గారే బయటకు వచ్చి మళ్ళీ రెండు బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇచ్చారు. లైఫ్ లో ఇప్పటివరకు అదొక్కటే జర్క్ తప్ప ఇంకేమి లేదు అని అన్నారు. దీంతో బాలయ్య అజ్ఞాతవాసి నుంచి అలవైకుంఠపురంలో అన్‌స్టాపబుల్ జర్నీ అని అన్నారు.