Akhanda Title Song : గూస్ బంప్స్ గ్యారంటీ..

‘అఖండ’ టైటిల్ సాంగ్ అభిమానులను ఆకట్టుకుంటోంది..

Akhanda Title Song : గూస్ బంప్స్ గ్యారంటీ..

Akhanda Title Song

Updated On : November 8, 2021 / 12:20 PM IST

Akhanda Title Song: ‘అఖండ’ మ్యూజికల్ రోర్ స్టార్ట్ అయ్యింది. ‘సింహా’, ‘లెజెండ్’ వంటి భారీ బ్లాక్‌బస్టర్స్ తర్వాత నటసింహా నందమూరి బాలకృష్ణ, ఊరమాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుల క్రేజీ కాంబినేషన్లో రూపొందుతున్న హ్యాట్రిక్ మూవీ ‘అఖండ’. మిర్యాల సత్యనారాయణ రెడ్డి సమర్పణలో ద్వారకా క్రియేషన్స్ పతాకంపై యువ నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు.

Balakrishna : మాట నిలబెట్టుకున్న బాలయ్య.. క్యాన్సర్ పేషంట్ కి ఉచిత వైద్యం

ప్రగ్యా జైస్వాల్, పూర్ణ కథానాయికలు. శ్రీకాంత్ కీలకపాత్రలో నటిస్తున్నారు. ఇప్పటివరకు రిలీజ్ చేసిన రెండు వీడియోలకు, ఫస్ట్ లిరికల్ సాంగ్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. దీపావళి కానుకగా నవంబర్ 4న ‘అఖండ’ టైటిల్ సాంగ్ టీజర్ రోర్ పేరుతో వీడియో విడుదల చెయ్యగా సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యింది.

NBK : ‘సూర్యవంశీ’ సినిమాలో బాలయ్య బొమ్మ

సోమవారం ఉదయం ‘అఖండ’ టైటిల్ సాంగ్ రిలీజ్ చేశారు. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ ట్యూన్ కంపోజ్ చెయ్యగా.. శంకర్ మహదేవన్, సిద్దార్థ్ మహదేవన్, శివం మహదేవన్ ఈ శ్లోకాన్ని అద్భుతంగా పాడారు. వాయిస్ అండ్ కోరస్ పాటను వేరే స్థాయికి తీసుకెళ్లాయి. ‘రాగ జ్వాలవై పాతర దీనుల కళ్ళ నిండా’ పదాలు ఆకట్టుకుంటున్నాయి. త్వరలో విడుదల తేది ప్రకటించనున్నారు.