బసవతారకంలో బాలయ్య అభిమానుల సేవా కార్యక్రమం

'యన్.బి.కె.సేవాసమితి' ఆధర్వంలో బసవతారకం ఇండో అమెరికన్ కేన్సర్ హాస్పిటల్‌లో చికిత్స చేయిుంచుకుంటున్న పేదలకు పండ్లు పంపిణీ చేసిన బాలయ్య అభిమానులు..

  • Published By: sekhar ,Published On : September 21, 2019 / 11:25 AM IST
బసవతారకంలో బాలయ్య అభిమానుల సేవా కార్యక్రమం

Updated On : September 21, 2019 / 11:25 AM IST

‘యన్.బి.కె.సేవాసమితి’ ఆధర్వంలో బసవతారకం ఇండో అమెరికన్ కేన్సర్ హాస్పిటల్‌లో చికిత్స చేయిుంచుకుంటున్న పేదలకు పండ్లు పంపిణీ చేసిన బాలయ్య అభిమానులు..

‘మనిషికి మనిషి సహాయం అందించాలి.. మానవత్వాన్ని బతికించాలి’.. అన్న నందమూరి బాలకృష్ణ పిలుపు మేరకు ఆయన అభిమానులు సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. బాలయ్య చూపిన బాటలో పయనిస్తున్నారు.

బసవతారకం కేన్సర్ హాస్పిటల్‌లో చికిత్స చేయించుకుంటున్న పేదవారికి.. ‘కర్నాటి కొండలరావు’, ‘తాళ్ళ సుబ్బారావు’, ‘విక్రమ్ సింహా’ తదితరులు తమ సొంత ఖర్చుతో పండ్లు అందించి.. బాలయ్య పట్ల తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు.

రీల్ లైఫ్‌లోనే కాక రాజకీయ నాయకుడిగా, కేన్సర్ హాస్పిటల్ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూ రియల్ లైఫ్ హీరోగానూ నిరూపించుకున్న ‘నందమూరి నటసింహం బాలయ్య అభిమానుల సేవాగుణం – అందరికీ ఆదర్శం’.. అంటూ పలువురు సోషల్ మీడియా ద్వారా బాలయ్య ఫ్యాన్స్ చేపట్టిన సేవా కార్యక్రమం గురించి ‘యన్.బి.కె.సేవాసమితి’ వారిని అభినందిస్తున్నారు.