NBK 107 : బాలయ్య కోసం పవర్‌ఫుల్ టైటిల్..!

నటసింహా నందమూరి బాలకృష్ణ - గోపిచంద్ మలినేని కాంబోలో రాబోతున్న సినిమాకి సాలిడ్ టైటిల్ ఫిక్స్ చేశారు..

NBK 107 : బాలయ్య కోసం పవర్‌ఫుల్ టైటిల్..!

Nbk 107

Updated On : September 14, 2021 / 12:40 PM IST

NBK 107: నటసింహా నందమూరి బాలకృష్ణ వరుసగా సినిమాలు లైనప్ చేస్తున్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటిస్తున్న ‘అఖండ’ షూటింగ్ ప్రస్తుతం ఫైనల్ స్టేజ్‌కి చేరుకుంది. దీని తర్వాత ఈ సంక్రాంతికి ‘క్రాక్’ తో బ్లాక్‌బస్టర్ అందుకున్న యంగ్ డైరెక్టర్ గోపిచంద్ మలినేనితో మూవీ ప్లాన్ చేశారు.

Krishnam Raju : కాలుజారి పడ్డ కృష్ణంరాజు.. అపోలో ఆస్పత్రిలో సర్జరీ..

మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ తమన్ సంగీతమందిస్తున్నారు. రియల్ ఇన్సిడెన్స్ ఆధారంగా తెరకెక్కించగా ‘క్రాక్’ హిట్ అవడంతో మరోసారి వాస్తవిక సంఘటనలపై ఫోకస్ పెట్టారు గోపిచంద్. అందుకోసం కొంతకాలం బాగా రీసెర్చ్ చేశారు. పురాతన లైబ్రరీలలో తనకు కావలసిన సమాచారాన్ని సేకరించారు.

Balakrishna : తారక్ తగ్గాడు.. బాలయ్య ‘అఖండ’ అక్టోబర్‌లోనే..

అయితే బాలయ్యతో చెయ్యబోయే సినిమా పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కబోతుందట.. ఇందులో నటసింహా మూడు డిఫరెంట్ క్యారెక్టర్లలో కనిపించనున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాకి ‘రౌడీయిజం’ అనే పవర్‌ఫుల్ టైటిల్, (An Action Entertainer) అనే ట్యాగ్‌లైన్ ఫిక్స్ చేశారని అంటున్నారు.

Balakrishna : అఖండ‏లో అదే హైలెట్..!