New Movie Opening : నాని మూవీ వర్క్స్ అండ్ రామా క్రియేషన్స్ ప్రొడక్షన్ నెంబర్ 1 చిత్రం ప్రారంభం

 స్త్రీ తల్లి అవ్వడం ఒక అదృష్టం. ఆ అదృష్టాన్ని సరిగ్గా వినియోగించుకోకపోతే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనే చిత్ర కథాంశంతో ఓ కొత్త సినిమా రానుంది.

New Movie Opening : నాని మూవీ వర్క్స్ అండ్ రామా క్రియేషన్స్ ప్రొడక్షన్ నెంబర్ 1 చిత్రం ప్రారంభం

Nani Movie Works & Raamaa Creations Production No. 1 Launched Grandly

New Movie Opening : స్త్రీ తల్లి అవ్వడం ఒక అదృష్టం. ఆ అదృష్టాన్ని సరిగ్గా వినియోగించుకోకపోతే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనే చిత్ర కథాంశంతో ఓ కొత్త సినిమా రానుంది. నాని మూవీ వర్క్స్ అండ్ రామా క్రియేషన్స్ పతాకంపై విశ్వ కార్తికేయ, ఆయుషి పటేల్ హీరో హీరోయిన్లుగా రమాకాంత్ రెడ్డిని దర్శకుడిగా పరిచయం చేస్తూ డాక్టర్ కె.చంద్ర ఓబుల్ రెడ్డి, జి మహేశ్వరరెడ్డి, కాటం రమేష్ లు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్న ప్రొడక్షన్ నెంబర్ 1చిత్రం పూజా కార్యక్రమాలు నేడు హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోలో ఘనంగా జరిగాయి.

ఈ కార్యక్రమానికి సీనియర్ నటులు సుమన్, నిర్మాత డి.ఎస్ రావు, సౌత్ ఇండియన్ ఫిలిం ఛాంబర్ చైర్మన్ శ్రీ కాట్రగడ్డ ప్రసాద్, తెలుగు నిర్మాతల మండలి ప్రెసిడెంట్ దామోదర ప్రసాద్, ఫార్మర్ తెలుగు ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ శ్రీ కొల్లి రామకృష్ణ, మిసెస్ ఇండియా నేషనల్ & ఇంటర్నేషనల్ సుహాసిని పాండ్యన్ తదితరులు చీఫ్ గెస్ట్ లుగా రావడం జరిగింది. సీనియర్ నటులు సుమన్ స్క్రిప్ట్ అందించారు. పూజా కార్యక్రమాల అనంతరం హీరో హీరోయిన్లపై చిత్రీకరించిన తొలి ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ నిర్మాత కె.ఎస్ రామారావు క్లాప్ కొట్టగా, దర్శకుల సంఘం అధ్యక్షులు కాశీ విశ్వనాధ్ కెమెరా స్విచ్ ఆన్ చేసారు. ప్రముఖ దర్శకులు నీలకంఠ గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం చిత్ర యూనిట్ పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు.

గెస్ట్ గా వచ్చిన నిర్మాతలు చిత్రయూనిట్ కి అల్ ది బెస్ట్ తెలిపారు. చిత్రం మంచి సక్సెస్ అవ్వాలని కోరుకున్నారు. చిత్ర నిర్మాతలు డా.కందుల చంద్ర ఓబుల్ రెడ్డి, కాటం రమేష్ మాట్లాడుతూ.. మా మొదటి సినిమా ప్రారంబోత్సవానికి ఇంతమంది పెద్దలు వచ్చి మమ్మల్ని బ్లెస్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఎడ్యుకేషన్ ఫీల్డ్ లో ఉన్న మాకు దర్శకుడు రమాకాంత్ రెడ్డి చెప్పిన కథ నచ్చడంతో కొత్త టాలెంట్ ని బయటికి తీసుకురావాలనే కాన్సెప్టుతో సినిమా ఇండస్ట్రీలోకి రావడం జరిగింది. తను కథ చెప్పిన విధానం మాకు ఎంతో ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. మాలాగే సినిమా చూస్తున్న ప్రేక్షకులు కూడా ఒక్క నిమిషం సినిమా మిస్ అయినా సినిమా అర్థం కాదు. దాంతో మళ్లీ చూడాలనిపించేలా ఈ కథ చాలా బాగుంటుంది. జులై మొదటి వారంలో షూటింగ్ ప్రారంభం జరుపుకొని సెప్టెంబర్ లో మూవీ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాము. మంచి కంటెంట్ తో వస్తున్న మా సినిమాను అందరూ ఆదరించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని అన్నారు.

చిత్ర దర్శకులు రమాకాంత్ రెడ్డి మాట్లాడుతూ.. నేను రాసుకున్న ఈ కథను తీసే నిర్మాతల కొరకు చాలా రోజుల నుండి వెయిట్ చేస్తున్న క్రమంలో నిర్మాతలు డా.కందుల చంద్ర ఓబుల్ రెడ్డి,గడ్డం మహేశ్వర రెడ్డి, కాటం రమేష్ గార్లు కలవడం జరిగింది. వారు ఈ స్టోరీ విన్న తరువాత వెంటనే ఈ సినిమా చేద్దామని నాని మూవీ వర్క్స్ అండ్ రామా క్రియేషన్స్ పతాకంపై ఈ సినిమా చేయడానికి ముందుకు వచ్చారు. హీరో, హీరోయిన్స్ కూడా కథకు తగ్గట్టు బాగా సెట్టయ్యారు. ఫుల్ థ్రిల్లర్ సెంటిమెంట్ తో వస్తున్న ఈ సినిమా అన్ని వర్గాల వారికీ కచ్చితంగా నచ్చుతుంది. ఇలాంటి మంచి సినిమా చేసే అవకాశం ఇచ్చిన నిర్మాతలకు నా ధన్యవాదాలు అన్నారు.

Aadikeshava Glimpse : శ్రీలీల బర్త్‌డే స్పెషల్.. వైష్ణవ తేజ్ ‘ఆదికేశవ’ గ్లింప్స్ రిలీజ్.. మీరు చాలా అందంగా ఉన్నారు..

చిత్ర హీరో విశ్వ కార్తికేయ మాట్లాడుతూ.. మమ్మల్ని ఆశీర్వదించడానికి చెన్నై నుంచి వచ్చిన ప్రసాద్ గారికి మరియు పెద్దలకు ధన్యవాదములు నేను చాలా రోజులుగా ఒక మంచి స్టోరీ కోసం వెతుకుతున్న. నాకు రమాకాంత్ రెడ్డి గారు చెప్పిన స్టోరీ చాలా ఇంట్రెస్ట్ కలిగించింది. ఫైనల్ గా ఇది కదా నేను ఎదురు చూసిన సబ్జెక్ట్ అనిపించి వెంటనే ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నాను. ఇలాంటి మంచి సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన నిర్మాతలకు నా ధన్యవాదాలు. మంచి కథతో చేస్తున్న ఈ సినిమా అన్ని వర్గాల వారికీ కచ్చితంగా నచ్చుతుంది అన్నారు.