Nani : పిలిచినా కాఫీ విత్ కరణ్ షోకి వెళ్లను.. కరణ్ జోహార్ షోపై నాని కామెంట్స్..

బాలీవుడ్ టాప్ టాక్ షో కాఫీ విత్ కరణ్(Koffee with Karan) షోకి పిలిస్తే వెళ్తారా అని అడగ్గా.. నాని దీనికి సమాధానమిస్తూ..

Nani : పిలిచినా కాఫీ విత్ కరణ్ షోకి వెళ్లను.. కరణ్ జోహార్ షోపై నాని కామెంట్స్..

Nani Sensational Comments on Bollywood Koffee with Karan Show

Updated On : November 10, 2023 / 6:54 PM IST

Nani : న్యాచురల్ స్టార్ నాని వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. ఇటీవల దసరా(Dasara) సినిమాతో వచ్చి భారీ విజయం సాధించిన నాని త్వరలో హాయ్ నాన్న(Hi Nanna) సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు. అయితే ఇటీవల సినిమాలకు సంబంధిన కొన్ని అంశాలపై కామెంట్స్ చేస్తూ వార్తల్లో కూడా నిలుస్తున్నాడు. తాజాగా ఓ నేషనల్ మీడియా నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న నాని బాలీవుడ్(Bollywood) కరణ్ జోహార్(Karan Johar) షోపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఈ సమావేశంలో బాలీవుడ్ టాప్ టాక్ షో కాఫీ విత్ కరణ్(Koffee with Karan) షోకి పిలిస్తే వెళ్తారా అని అడగ్గా.. నాని దీనికి సమాధానమిస్తూ.. కాఫీ విత్ కరణ్ షోకి పిలిచినా రాను అని గౌరవంగా చెప్పేస్తాను. కరణ్ జోహార్ ని కలిసి, సినిమాల గురించి కాసేపు మాట్లాడమంటే ఓకే కానీ ఆ షోకి మాత్రం వెళ్ళను. నాలాంటి వాళ్లకి ఆ షో సెట్ అవ్వదు అని అన్నాడు. దీంతో నాని చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

Also Read : మళ్ళీ ఆదిపురుష్ వివాదాన్ని గుర్తుచేసిన రచయిత.. నేను తప్పు చేశాను అంటూ రైటర్ మనోజ్ కామెంట్స్..

బాలీవుడ్ లో హిట్ టాక్ షో అయిన కాఫీ విత్ కరణ్ పాపులర్ అయినా గాని, దీనిపై చాలా మందికి నెగిటివ్ అభిప్రాయమే ఉంది. ఎక్కువ బోల్డ్ కంటెంట్, పర్సనల్ ప్రశ్నలు అడుగుతూ ఇంటర్వ్యూకి వచ్చిన వారిని కరణ్ ఇబ్బంది పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. దీంతో కరణ్ షోపై బయట కూడా కొంతమందిలో వ్యతిరేకత ఉంది. ఇలాంటి వాటి వల్లే నాని కూడా ఈ షోకి పిలిచినా వెళ్ళను అని చెప్పాడని అంతా భావిస్తున్నారు.