నాని 24కి కొబ్బరికాయ కొట్టారు

నాని, విక్రమ్ కుమార్ సినిమా ప్రారంభం..

  • Published By: sekhar ,Published On : February 18, 2019 / 06:42 AM IST
నాని 24కి కొబ్బరికాయ కొట్టారు

నాని, విక్రమ్ కుమార్ సినిమా ప్రారంభం..

నేచురల్ స్టార్ నాని, 13 బి, ఇష్క్, మనం, 24 వంటి డిఫరెంట్ సినిమాలతో ఆడియన్స్‌ని ఆకట్టుకున్న టాలెంటెడ్ డైరెక్టర్ విక్రమ్ కె.కుమార్ కాంబినేషన్‌లో ఒక సినిమా రూపొందనుంది. శ్రీమంతుడు, జనతాగ్యారేజ్, రంగస్థలం వంటి సూపర్ హిట్ సినిమాలను నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై, నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి, మోహన్ చెరుకూరి నిర్మిస్తున్నారు. హీరోగా నానికిది 24 వ సినిమా.. ఈ రోజు (ఫిబ్రవరి 18) పూజా కార్యక్రమాలతో ఈ సినిమా ప్రారంభమైంది. దేవుడి పటాలపై చిత్రీకరించిన మూహూర్తపు సన్నివేశానికి డైరెక్టర్ కొరటాల శివ క్లాప్ కొట్టగా, శ్రేష్ఠ్ మూవీస్ అధినేత ఎన్.సుధాకర్ రెడ్డి కెమెరా స్విచ్ ఆన్ చేసారు. శరత్ మరార్ యూనిట్‌కి స్క్రిప్ట్ అందజేసారు. 

రేపటి (ఫిబ్రవరి 19) నుండి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది. కార్తికేయ (RX 100), ప్రియాంక, లక్ష్మీ, శరణ్య, అనీష్ కురువిల్లా, వెన్నెల కిషోర్ తదితరులు నటిస్తున్నఈ సినిమాకి మ్యూజిక్ : అనిరుధ్ రవిచందర్, కెమెరా : మిరోస్లా కుబా బ్రోజెక్, మాటలు : వెంకీ, డార్లింగ్ స్వామి, ఎడిటింగ్ : నవీన్ నూలి, ఆర్ట్ : రామ్ కుమార్, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం : విక్రమ్ కె.కుమార్.నాని, గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో చేస్తున్న జెర్సీ, ఏప్రిల్‌లో రిలీజ్ కాబోతుంది.