MAD Movie Review : ‘మ్యాడ్’ సినిమా రివ్యూ.. రెండు గంటల పాటు కడుపు చెక్కలయ్యేలా నవ్వుకోవచ్చు..

మొదటి నుంచి కూడా ఈ సినిమాని ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్ లా ప్రమోట్ చేశారు. ఎలాంటి అంచనాలు లేకుండా, లాజిక్స్ లేకుండా మూడు గంటలు సరదాగా ఫుల్ గా నవ్వుకోవాలి అనుకుంటే

MAD Movie Review : ‘మ్యాడ్’ సినిమా రివ్యూ.. రెండు గంటల పాటు కడుపు చెక్కలయ్యేలా నవ్వుకోవచ్చు..

Narne Nithin Sangeeth Shobhan MAD Movie Review and Rating MAD Full length Comedy Entertainer

Updated On : October 6, 2023 / 11:32 AM IST

MAD Movie Review : జూనియర్ ఎన్టీఆర్ (NTR) బామ్మర్ది నార్నె నితిన్ (Narne Nithiin), సంగీత్ శోభన్, రామ్ నితిన్, గౌరి ప్రియా, అనంతిక, గోపిక ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన సినిమా ‘మ్యాడ్’. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ లో మ్యాడ్ సినిమాని డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ తెరకెక్కించాడు. మ్యాడ్ సినిమా నేడు అక్టోబర్ 6న థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ అయింది.

కథ విషయానికొస్తే ఒకే ఇంజనీరింగ్ కాలేజీ, అందులో చేరిన స్టూడెంట్స్ కలిసి చేసే అల్లరి. వాళ్ళు ఎలా జాయిన్ అయ్యారు, కాలేజీ ఎలా అయిపోయింది. చాలా సింపుల్ లైన్ తీసుకున్నా 2 గంటల పాటు కాలేజీలో ముగ్గురు స్టూడెంట్స్, వాళ్ళతో పాటు చుట్టూ ఉండే స్టూడెంట్స్, సీనియర్స్, కాలేజీ స్టాఫ్ చేసే అల్లరి, కాలేజీలో గొడవలు, చదువులు.. అన్ని ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్ గా చూపించారు.

ఆల్రెడీ ఇలాంటి పాయింట్ లో హ్యాపీడేస్, 3 ఇడియట్స్.. లాంటి పలు సినిమాలు వచ్చాయి. కానీ వాటిల్లో ఎమోషన్స్, మెసేజ్ లు ఉంటాయి. ఈ సినిమాలో మాత్రం కేవలం కామెడీ మాత్రమే ఉంటుంది. సినిమా మొత్తంలో సంగీత్ శోభన్ తో పాటు విష్ణు అనే మరో నటుడు ఇద్దరూ కలిసి సినిమాని ఎంటర్టైన్మెంట్ లో ఇంకో రేంజ్ కి తీసుకెళ్లారు.

Also Read : ఇంజనీరింగ్ పోరలు రచ్చ.. ‘మ్యాడ్’ మూవీ టీజర్ చూసి మ్యాడ్ అవ్వాల్సిందే..

మొదటి నుంచి కూడా ఈ సినిమాని ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్ లా ప్రమోట్ చేశారు. ఎలాంటి అంచనాలు లేకుండా, లాజిక్స్ లేకుండా మూడు గంటలు సరదాగా ఫుల్ గా నవ్వుకోవాలి అనుకుంటే మ్యాడ్ సినిమాకు వెళ్లి ఎంటర్టైన్ అవ్వొచ్చు. సినిమా చూస్తే మన కాలేజీ డేస్ గుర్తుకు వస్తాయి. యూత్ కి ఇంకా బాగా నచ్చుతుంది. ఈ సినిమాకు 3.5 రేటింగ్ ఇవ్వొచ్చు.

గమనిక : ఈ రివ్యూ, రేటింగ్ కేవలం విశ్లేషకుడి అభిప్రాయం మాత్రమే..