Navdeep : నవదీప్ 2.0…. సరికొత్తగా రాబోతున్న నవదీప్
తాజాగా తనని తాను సరికొత్తగా ప్రెజెంట్ చేసుకోడానికి రెడీ అవుతున్నాడు నవదీప్. జనవరి 26 తన పుట్టిన రోజు సందర్భంగా కొత్త సినిమాని ప్రకటించాడు. టైటిల్ టీజర్ ని విడుదల చేసారు............

Navadeep
Navdeep : టాలీవుడ్‌లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్స్‌లో నవదీప్ ఒకడు. 2004లో తేజ దర్శకత్వంలో వచ్చిన ‘జై’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన నవదీప్ ఆ తర్వాత హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, సెకండ్ హీరోగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. ఆ తర్వాత బుల్లితెరపై యాంకర్ గా, జడ్జిగా కూడా మెప్పించాడు. ఇప్పుడు ఓటీటీలో వెబ్ సిరీస్ లు, మరోవైపు సినిమాలు కూడా చేస్తూ బిజీబిజీగా ఉన్నాడు నవదీప్.
తాజాగా తనని తాను సరికొత్తగా ప్రెజెంట్ చేసుకోడానికి రెడీ అవుతున్నాడు నవదీప్. జనవరి 26 తన పుట్టిన రోజు సందర్భంగా కొత్త సినిమాని ప్రకటించాడు. టైటిల్ టీజర్ ని నిన్న విడుదల చేసారు చిత్ర బృందం. ‘పుట్టినందుకు థ్యాంక్స్’ అంటూ మొదలైన ఈ టీజర్‌లో సినిమాకు ‘లవ్ మౌలి’ అన్న టైటిల్‌ను వెల్లడించారు. ఇందులో ఇంట్రడ్యూసింగ్ నవదీప్ 2.0 అని కూడా వేసుకున్నాడు.
Anchor Shyamala : కొత్త ఇంట్లోకి గృహప్రవేశం చేసిన యాంకర్ శ్యామల
ఫుల్ గడ్డం, జుట్టుతో అఘోరాలా ఉన్న పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఈ సినిమాకు అవనీంద్ర దర్శకత్వం వహిస్తుండగా నైరా క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రశాంత్ రెడ్డి మరియు సి స్పేస్ బ్యానర్ పై నవదీప్ కలిసి నిర్మిస్తున్నారు. దీంతో నవదీప్ ఏదో కొత్త ప్రయోగమే చేయబోతున్నట్లు తెలుస్తుంది.