Nayanthara : మగాళ్లని అలా అడగరు.. అమ్మాయిలనే అడుగుతారు.. తన పాత రిలేషన్ షిప్ గురించి మాట్లాడిన నయనతార..

నయనతార తన గత రిలేషన్స్ గురించి మాట్లాడింది.

Nayanthara : మగాళ్లని అలా అడగరు.. అమ్మాయిలనే అడుగుతారు.. తన పాత రిలేషన్ షిప్ గురించి మాట్లాడిన నయనతార..

Nayanthara Comments on her Past Relations in her Netflix Documentary Nayanthara Beyond the Fairy Tale

Updated On : November 18, 2024 / 2:46 PM IST

Nayanthara : నయనతారపై నెట్ ఫ్లిక్స్ లో డాక్యుమెంటరీ చేయగా అది నేడు రిలీజయింది. ఈ డాక్యుమెంటరీలో తన కెరీర్ ఎలా మొదలయింది, తన సినిమాలు, తన ప్రేమ పెళ్లి, కుటుంబం.. ఇలా అన్ని విషయాలు మాట్లాడింది. ఈ క్రమంలో నయనతార తన గత రిలేషన్స్ గురించి మాట్లాడింది.

ఈ డాక్యుమెంటరీలో నయనతారతో పాటు ఆమెతో పనిచేసిన పలువురు హీరోలు, డైరెక్టర్స్, టెక్నిషియన్స్ కూడా కనిపించి నయన్ గురించి మాట్లాడారు. ఈ క్రమంలో నాగార్జున మాట్లాడుతూ.. తన రిలేషన్ షిప్ లో ప్రాబ్లమ్ ఉందని అనిపించేది. తన ఫోన్ రింగ్ అయితే సెట్ లో అందరికి భయమేసేది. ఎప్పుడూ ఫోన్ లో గొడవలు. ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడితే తన మూడ్ అంతా మారిపోయేది అని తెలిపారు.

Also Read : Resul Pookutty : పుష్ప 2 పై ఆస్కార్ విజేత పోస్ట్.. సౌండ్ డిజైనింగ్ అదిరిపోతుందట..

దీనిపై నయనతార స్పందిస్తూ.. రిలేషన్ షిప్ అనేది నమ్మకం మీదే కొనసాగుతుంది. నేను అతన్ని నమ్మాను. అవతలి వ్యక్తి కూడా నన్ను ప్రేమిస్తున్నారని అనుకున్నాను. నా గత రిలేషన్ షిప్ గురించి నేను ఎక్కడా మాట్లాడలేదు. కానీ జనాలు ఇష్టమొచ్చినట్టు అనుకున్నారు. ఒక అమ్మాయి గురించి కాబట్టే ఇలా మాట్లాడారు, నన్ను ప్రశ్నించేవారు, నా గురించి ఇష్టమొచ్చినట్టు మాట్లాడేవాళ్ళు. మగాళ్లని ఎందుకు ఇలా చేసావు అని ఎవరూ అడగరు కానీ అమ్మాయిలను అడుగుతారు. తప్పంతా నేనే చేసినట్టు రాస్తారు ఇది కరెక్ట్ కాదు అంటూ ఎమోషనల్ అయింది.

నయనతార నేను రౌడీనే సినిమా సమయంలో డైరెక్టర్ విగ్నేష్ శివన్ తో ప్రేమలో పడి కొన్నేళ్లు ప్రేమించుకొని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే గతంలో నయనతార శింబు, ప్రభుదేవాలతో ప్రేమలో ఉందని వార్తలు వచ్చాయి. ఆ వార్తలను ఉద్దేశించే నయన్ ఈ వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తుంది. అయితే తను గతంలో ఎవరితో రిలేషన్ షిప్ లో ఉందో మాత్రం చెప్పలేదు నయన్.