దర్బార్‌లోకి ఎంటర్ అయిన నయన్
ఏ.ఆర్.మురగదాస్ డైరెక్షన్‌లో, లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న 'దర్బార్' సినిమా షూటింగ్ ముంబాయిలో స్టార్ట్ అయ్యింది.

ఏ.ఆర్.మురగదాస్ డైరెక్షన్‌లో, లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ‘దర్బార్’ సినిమా షూటింగ్ ముంబాయిలో స్టార్ట్ అయ్యింది.
సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్, లేడీ సూపర్ స్టార్ నయనతార జంటగా, టాప్ డైరెక్టర్ ఏ.ఆర్.మురగదాస్ డైరెక్షన్‌లో, లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ‘దర్బార్’ సినిమా షూటింగ్ ముంబాయిలో స్టార్ట్ అయ్యింది. ఈ రోజు నుండి నయనతార షూటింగ్‌లో జాయిన్ అవుతుంది. రజినీతో మురగదాస్ పనిచెయ్యడం ఇదే మొదటిసారి. చంద్రముఖిలో సెకండ్ హీరోయిన్‌గానూ, శివాజీ, కథానాయకుడు సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేసిన నయనతార, ఫస్ట్ టైమ్ రజినీతో పూర్తిస్థాయి హీరోయిన్‌గా నటిస్తుంది.
దాదాపు 25 ఏళ్ళ తర్వాత రజినీ ఈ సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నాడు.. ఆగష్టు లోపు షూటింగ్ కంప్లీట్ చేసి, 2020 సంక్రాంతికి దర్బార్‌ని రిలీజ్ చెయ్యనున్నారు. ఈ సినిమాకి కెమెరా : సంతోష్ శివన్, ఎడిటింగ్ : శ్రీకర్ ప్రసాద్, సంగీతం : అనిరుధ్, లిరిక్స్ : వివేక్.