Vignesh – Nayan : భర్తతో సాంప్రదాయంగా క్యూట్ ఫోటోలు షేర్ చేసిన నయనతార..
లేడీ సూపర్ స్టార్ నయనతార(Nayanthara), తన భర్త విగ్నేష్ శివన్(Vignesh Shivan) రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తూ ఉంటారు.

Nayanthara Vignesh Shivan Shares Photos in Traditional Looks
Vignesh – Nayan : లేడీ సూపర్ స్టార్ నయనతార(Nayanthara), తన భర్త విగ్నేష్ శివన్(Vignesh Shivan) రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తూ ఉంటారు. వాళ్ళ పెళ్లి అయిన దగ్గర్నుంచి క్యూట్ ఫోటోలు బోలెడన్ని షేర్ చేస్తూ వారికి ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమని చూపిస్తున్నారు. తాజాగా ఈ జంట సాంప్రదాయంగా కొన్ని ఫోటోలు షేర్ చేశారు.
ఈ ఫొటోల్లో నయనతార రెడ్ శారీ కట్టుకోగా, విగ్నేష్ శివన్ లాల్చీ పైజామా వేశారు. అందంగా పూలతో డెకరేట్ చేసిన ఇంట్లో పూజలు చేసినట్టు ఫోటోలు షేర్ చేశారు. ఓ ఫొటోలో విగ్నేష్ దేవుడి ఫోటో పట్టుకోగా నయన్ దీపం పట్టుకొని ఉన్నారు. మరో ఫొటోలో ఇద్దరూ దండం పెట్టుకుంటున్నారు. మరో ఫొటోలో క్యూట్ గా ఒకరి కళ్ళల్లోకి చూస్తూ ఫోటో షేర్ చేశారు.
Also Read : Rajamouli : సలార్ ఫస్ట్ టికెట్ కొన్న రాజమౌళి.. స్పెషల్ ఇంటర్వ్యూ పిక్ లీక్.. ప్రభాస్ ఎలా ఉన్నాడో చూడండి..
ఈ ఫోటోలని షేర్ చేస్తూ విగ్నేష్.. కొత్త ప్రారంభం అని పోస్ట్ చేశారు. నయన్ ఈ ఫోటోలను షేర్ చేస్తూ.. దేవుడ్ని, ప్రేమని నమ్మాలి అని పోస్ట్ చేసింది. ప్రస్తుతం నయన్ – విగ్నేష్ ఫోటోలు వైరల్ గా మారాయి.