బాబు రెడీ బాబు.. యాక్షన్ : డిసెంబర్ 12 నుండి రెగ్యులర్ షూటింగ్!
నటసింహ నందమూరి బాలకృష్ణ, ఊరమాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కనున్న NBK 106 రెగ్యులర్ షూటింగ్ డిసెంబర్ 12 నుండి ప్రారంభం కానుందని తెలుస్తోంది..

నటసింహ నందమూరి బాలకృష్ణ, ఊరమాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కనున్న NBK 106 రెగ్యులర్ షూటింగ్ డిసెంబర్ 12 నుండి ప్రారంభం కానుందని తెలుస్తోంది..
నటసింహ నందమూరి బాలకృష్ణ, ఊరమాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో ముచ్చటగా మూడో సినిమా రానున్న సంగతి తెలిసిందే.. ‘సింహా’, ‘లెజెండ్’ సినిమాలకు మించిన సినిమా చేయాలని బోయపాటి చాలా జాగ్రత్తగా కథా, కథనాలు రెడీ చేశాడని తెలుస్తోంది..
మిర్యాల రవీందర్ రెడ్డి భారీ బడ్జెట్‌తో నిర్మించనున్న NBK 106కి సంబంధించి క్రేజీ అప్‌డేట్స్, ఫ్యాన్ మేడ్ పోస్టర్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే ప్రీ-ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయట. తాజాగా ఈ సినిమా షూటింగ్‌కి సంబంధించి ఓ న్యూస్ ఫిలింనగర్‌లో వినిపిస్తోంది. బాలయ్య, బోయపాటి కలయికలో తెరకెక్కనున్న NBK 106 రెగ్యులర్ షూటింగ్ డిసెంబర్ 12 నుండి ప్రారంభం కానుందని తెలుస్తోంది. బాలయ్య, కె.ఎస్. రవికుమార్ దర్శకత్వంలో నటించిన ‘రూలర్’ డిసెంబర్ 20న భారీగా విడుదల కానుంది.