AR Rahman : AI సాయంతో రెహమాన్ కొత్త ప్రయోగం.. విమర్శలు చేస్తున్న నెటిజెన్స్

సంగీత దిగ్గజం ఏ.ఆర్.రెహమాన్ చేస్తున్న సరికొత్త ప్రయోగంపై విమర్శలు వినిపిస్తున్నాయి. AI సాయంతో ఆయన చేస్తున్న ప్రయోగంపై నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు.

AR Rahman : AI సాయంతో రెహమాన్ కొత్త ప్రయోగం.. విమర్శలు చేస్తున్న నెటిజెన్స్

AR Rahman

Updated On : February 1, 2024 / 6:10 PM IST

AR Rahman : అగ్ర సంగీత దర్శకుడు, ఆస్కార్ విన్నర్ ఏ.ఆర్.రెహమాన్ తన సంగీతంలో సరికొత్త ప్రయోగం చేయబోతున్నారు. AI సాయంతో మరణించిన ఇద్దరు సింగర్స్ వాయిస్‌ని సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా ‘లాల్ సలామ్’ లో ఓ పాట కోసం రీక్రియేట్ చేయబోతున్నారు.

Tollywood : టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో కీలక తీర్పు.. పూరీ, తరుణ్‌ శరీరంలో డ్రగ్స్‌ ఆనవాళ్లు లేవు..

వివాదాలు, విమర్శలు రెహమాన్‌కి కొత్తేం కాదు. తాజాగా ఓ పాట విషయంలో మళ్లీ విమర్శలు ఎదుర్కుంటారాయన. దివంగత గాయకులు బాంబా బాక్యా, షాహుల్ హమీద్ వాయిస్‌లను కృత్రిమ మేధస్సు (AI) సాయంతో పున:సృష్టిస్తున్నారు.  రజనీకాంత్ సినిమా ‘లాల్ సలామ్’ లో ఓ పాట కోసం వాడబోతున్నారు. ఈ విషయాన్ని రెహమాన్ తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. గాయకుడు బాంబా బాక్యా 41 సంవత్సరాల వయసులో 2022 లో గుండెపోటుతో కన్నుమూసారు. షాహుల్ హమీద్ 1997 లో జరిగిన కారు ప్రమాదంలో 44 ఏళ్ల వయసులో మరణించారు. వీరిద్దరూ వాయిస్‌లను లాల్ సలామ్ సినిమాలోని ‘తిమిరి యేసుదా’ పాట కోసం ఉయోగిస్తున్నారు. అయితే ఈ విషయంలో ఆ గాయకుల కుటుంబాల నుండి ఆమోదం తీసుకున్నామని.. వారికి రెమ్యునరేషన్ కూడా ఇచ్చామని రెహమాన్ తన ట్వీట్ లో పేర్కొన్నారు. కానీ ఈ విషయంపై నెటిజన్ల నుండి ఆయన విమర్శలు ఎదుర్కుంటున్నారు.

Brahmanandam : బ్రహ్మానందం బర్త్‌డే.. ఫ్యాన్స్ స్పెషల్ ఎడిటింగ్స్.. యానిమల్, విక్రమ్ వెర్షన్ బ్రహ్మిని చూశారా..!

మ్యూజిక్ డైరెక్టర్లు ప్రస్తుత సాంకేతికతకు అనుగుణంగా ఉండాలని కొందరు రెహమాన్ ప్రయత్నాన్ని అభినందించగా.. మరికొందరు ఈ చర్యను అగౌరవం, అనైతికం.. అంటూ విమర్శించారు. కాగా రెహమాన్ తన ట్వీట్‌లో సాంకేతికతను సరిగ్గా ఉపయోగిస్తే అది ముప్పు , ఉపద్రవం కానే కాదంటూ రాసుకొచ్చారు. ఈ పోస్టుపై మరికొందరు నెటిజన్లు భవిష్యత్‌లో దివంగత గాయనీ, గాయకులు  స్వర్ణలత, SPB గొంతులను వినాలని ఉందని.. మీరు తప్ప ఇలాంటి ప్రయోగాలు ఎవరూ చేయలేరు అని రెహమాన్‌పై ప్రశంసలు కురిపించారు.