TFJA: టీఎఫ్‌జేఏ నూతన కార్యవర్గం ఏర్పాటు.. అధ్యక్షుడిగా వైజే రాంబాబు

తెలుగు చిత్ర పరిశ్రమలోని విలేకరుల ఆరోగ్యం, సంక్షేమం ప్రధాన లక్ష్యంగా (TFJA)పని చేస్తున్న సంస్థ 'తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్'. తాజాగా అసోసియేషన్ యొక్క నూతన కార్యవర్గం ఏర్పాటు జరిగింది.

TFJA: టీఎఫ్‌జేఏ నూతన కార్యవర్గం ఏర్పాటు.. అధ్యక్షుడిగా వైజే రాంబాబు

New executive committee of Telugu Film Journalists Association formed

Updated On : October 24, 2025 / 7:56 PM IST

TFJA: తెలుగు చిత్ర పరిశ్రమలోని విలేకరుల ఆరోగ్యం, సంక్షేమం ప్రధాన లక్ష్యంగా పని చేస్తున్న సంస్థ ‘తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్’. తాజాగా అసోసియేషన్ యొక్క నూతన కార్యవర్గం ఏర్పాటు జరిగింది. ఇందులో టీఎఫ్‌జేఏ నూతన అధ్యక్షునిగా వైజే రాంబాబు ఎన్నికవగా.. ప్రధాన కార్యదర్శిగా ప్రసాదం రఘు, కోశాధికారిగా సురేంద్ర కుమార్ నాయుడు, ఉపాధ్యక్షులుగా వి ప్రేమ మాలిని, జే అమర్ వంశీ ఎన్నికయ్యారు. ఇక (TFJA)సంయుక్త కార్యదర్శులుగా జీవి రమణ, సురేష్ కొండి ఎంపిక ఏకాగ్రవంగా జరిగింది. ఎగ్జిక్యూటివ్ కమిటీ (ఈసీ) మెంబర్లుగా.. ఎం చంద్రశేఖర్, వై రవిచంద్ర, ఫణి కందుకూరి, డా చల్లా భాగ్యలక్ష్మి, బి వేణు, శివ మల్లాల, రాంబాబు పర్వతనేని, దీపక్ కోడెల, కె సతీష్, శ్రీను దుడ్డి, సత్య పులగం నియమితులయ్యారు.

Anasuya: మేనేజర్ ను తొలగించిన అనసూయ.. డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వండి అంటూ పోస్ట్

ఇక తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ లో ప్రింట్, ఎలక్ట్రానిక్, వెబ్, డిజిటల్ మీడియా సంస్థల్లో కలిపి మొత్తం 221 మంది సభ్యులు విధులు నిర్వహిస్తున్నారు. వీరికి ప్రతి ఏడాది హెల్త్ ఇన్సూరెన్స్, యాక్సిడెంటల్ పాలసీని అందిస్తోంది టీఎఫ్‌జేఏ. అలాగే, హెల్త్ క్యాంపులు, సంక్షేమ, సహాయ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తోంది. ఇక కొత్తగా ఏర్పాటైన వైజే రాంబాబు నాయకత్వంలోని కార్యవర్గం అసోసియేషన్ సభ్యుల కోసం హౌసింగ్ సొసైటీ, క్లబ్ హౌస్ వంటివి ఏర్పాటు చేయడానికి కృషి చేస్తామని తెలిపింది.