క్రాక్ కిరాక్ పోస్టర్
మాస్ మహారాజ్ రవితేజ, శృతి హాసన్ జంటగా నటిస్తున్న ‘క్రాక్’ సినిమా నుంచి సంక్రాంతి పోస్టర్ విడుదల..

మాస్ మహారాజ్ రవితేజ, శృతి హాసన్ జంటగా నటిస్తున్న ‘క్రాక్’ సినిమా నుంచి సంక్రాంతి పోస్టర్ విడుదల..
మాస్ మహారాజ్ రవితేజ, గోపిచంద్ మలినేని కాంబోలో రూపొందుతున్న సినిమా ‘క్రాక్’.. హీరోగా రవితేజ 66వ సినిమా ఇది.. ‘డాన్ శీను’, ‘బలుపు’ తర్వాత గోపిచంద్ మలినేని రవితేజతో హ్యాట్రిక్ హిట్‌కి రెడీ అయ్యాడు. రవితేజ పవర్‌ఫుల్ పోలీస్ పాత్రలో కనిపించనున్న ఈ సినిమాలో శృతి హాసన్ కథానాయికగా నటిస్తుండగా.. తమిళ నటుడు, దర్శకుడు సముద్రఖని, వరలక్ష్మీ శరత్ కుమార్ ఇంపార్టెంట్ రోల్స్ చేస్తున్నారు.
సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకులకు శుభాకాంక్షలు తెలియచేస్తూ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. ముందు బాబుని కూర్చోబెట్టుకుని శృతి హాసన్ రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ నడుపుతుండగా రవితేజ వెనక రెండుచేతులతో రెండు స్టీల్ క్యాన్స్ పట్టుకుని కూర్చున్న లుక్ అదిరిపోయింది. ముగ్గురూ సాంప్రదాయ దుస్తుల్లో గాగుల్స్‌తో కనిపించారు.
కొద్ది గ్యాప్ తర్వాత రవితేజ ఈ సినిమాలో ఓ పాట పాడడం విశేషం.. ‘‘హ్యాపీ సంక్రాంతి.. ఎంజాయ్ విత్ ఫ్యామిలీ’’ అంటూ చిత్ర యూనిట్ విడుదల చేసిన ఈ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ‘క్రాక్’ ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటోంది. కెమెరా : జికె విష్ణు, ఎడిటింగ్ : నవీన్ నూలి, మాటలు : సాయి మాధవ్ బుర్రా, సంగీతం : థమన్, ఆర్ట్ : ఏఎస్ ప్రకాష్, ఫైట్స్ : రామ్ లక్ష్మణ్.