Project-K: ప్రభాస్ ‘ప్రాజెక్ట్-K’ మూవీపై కొత్త బజ్.. నిరాశలో ఫ్యాన్స్..?
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్నాడు. దర్శకుడు నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో ప్రభాస్ ప్రాజెక్ట్-K అనే సైన్స్ ఫిక్షన్ మూవీలో నటిస్తున్నాడు. అయితే ఇప్పుడు ప్రాజెక్ట్-K మూవీ గురించి ఓ వార్త నెట్టింట జోరుగా వినిపిస్తోంది.

News Of Project-K Movie Shoot Paused Goes Viral
Project-K: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్నాడు. ఇప్పటికే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘సలార్’ సినిమాను శరవేగంగా పూర్తి చేస్తున్న ప్రభాస్, బాలీవుడ్‌లో తెరకెక్కిన ‘ఆదిపురుష్’ సినిమాను కూడా రెడీ చేశాడు. ఈ సినిమాలతో పాటు దర్శకుడు మారుతి డైరెక్షన్‌లోనూ ఓ సినిమాను చేస్తున్నాడు.
Project K: ప్రాజెక్ట్ Kకు సంగీతం అందించేది ఎవరంటే..?
కాగా, దర్శకుడు నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో ప్రభాస్ ఓ భారీ సైన్స్ ఫిక్షన్ మూవీలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు ‘ప్రాజెక్ట్-K’ అనే వర్కింగ్ టైటిల్‌ను పెట్టిన చిత్ర యూనిట్, ఇప్పటికే ఈ సినిమా షూటింగ్‌ను శరవేగంగా జరుపుకుంటోంది. ఈ సినిమాలో ప్రభాస్ పాత్ర అల్టిమేట్‌గా ఉండబోతుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఇక ఈ సినిమాలో భారీ క్యాస్టింగ్ ఉండగా, వారిలో బిగ్ బి అమితాబ్ బచ్చన్, బాలీవుడ్ హీరోయిన్లు దీపికా పదుకొనే, దిషా పటానీలు ఉన్నారు. అయితే ఇప్పుడు ప్రాజెక్ట్-K మూవీ గురించి ఓ వార్త నెట్టింట జోరుగా వినిపిస్తోంది.
Amitabh Bachchan : ప్రాజెక్ట్-K షూటింగ్‌లో అమితాబ్ బచ్చన్‌కి ప్రమాదం..
ఇటీవల ఈ చిత్ర షూటింగ్‌లో బిగ్ బి అమితాబ్ బచ్చన్‌కు గాయాలు కావడంతో, ఆయన ఈ సినిమా షూటింగ్‌కు దూరంగా ఉంటున్నారని.. దీంతో ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హోల్డ్‌లో పడిందని చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అయితే, ఈ సినిమా షూటింగ్ హోల్డ్‌లో పడిందనే విషయంపై మాత్రం చిత్ర యూనిట్ నుండి ఎలాంటి అప్డేట్ రాలేదు. దీంతో ప్రాజెక్ట్-K మూవీ గురించి వస్తున్న వార్తలు నిజమేనా అనే సందేహం అభిమానుల్లో నెలకొంది. మరి ఈ విషయంపై చిత్ర యూనిట్ ఏదైనా అప్డేట్ ఇస్తుందేమో చూడాలి.