మెగా ఇంట పెళ్లి సందడి: నిహారిక పెళ్లి తేదీ ఖరారు

  • Published By: vamsi ,Published On : November 4, 2020 / 03:59 PM IST
మెగా ఇంట పెళ్లి సందడి: నిహారిక పెళ్లి తేదీ ఖరారు

Updated On : November 4, 2020 / 4:21 PM IST

Niharika Konidela:మెగా డాటర్‌ నిహారిక- జొన్నలగడ్డ చైతన్యల నిశ్చితార్థం ఇప్పటికే జరగగా.. ఇప్పుడు పెళ్లి ముహూర్తం ఖరారు చేసుకున్నారు కుటుంబ సభ్యులు. డిసెంబర్ 9వ తేదీన రాత్రి 7.15 నిమిషాలకు ఈ వేడుక జరగనుంది. మెగాఫ్యామిలీ మొత్తం ఈ వేడుకలో సందడి చేయబోతుంది. నాగబాబు కుమార్తె నిహారిక, జొన్నలగడ్డ చైతన్యల నిశ్చితార్థం హైదరాబాదులో ఘనంగా జరిగింది.



చైతన్య గుంటూరు రేంజి ఐజీ ప్రభాకర్ రావు తనయుడు. ఓ ప్రముఖ ఐటీ కంపెనీలో పనిచేస్తున్నాడు. కరోనా కారణంగా అతి తక్కువ మంది అథితులు మాత్రమే నిశ్చితార్ధ వేడుకకు హాజరయ్యారు. మెగా కుటుంబ సభ్యులతో పాటు..చైతన్య కుటుంబానికి చెందిన కొద్దిమంది కుటుంబ సభ్యుల సమక్షంలో నిశ్చితార్థం జరగగా.. ఇప్పుడు పెళ్లి వేడుకను రాజస్థాన్ ఉదయపూర్‌లోని ఉదయ విలాస్‌లో జరిపేందుకు కుటుంబం నిర్ణయించుకుంది.



అప్పుడు నిశ్చితార్థ వేడుకలో నాగబాబు కుటుంబ సభ్యులతో పాటు చిరంజీవి దంపతులు, రామ్ చరణ్-ఉపాసన, అల్లు అర్జున్, సాయిధరమ్ తేజ్ తదితరులు సందడి చేయగా.. ఇప్పుడు కూడా కోవిడ్ నిబంధనల ప్రకారం అతి కొద్ది మంది అతిథులకు మాత్ర‌మే ఆహ్వానం పంసనున్నట్లుగా తెలుస్తుంది. చైత‌న్య కుటుంబంతో మెగా ఫ్యామిలీకి ఎప్ప‌టి నుంచో అనుబంధం ఉంది. చిరంజీవి తండ్రి కొణిదెల వెంక‌ట‌రావు, చైత‌న్య తాత‌య్య గుణ వెంక‌ట‌ర‌త్నం స్నేహితులు.