Bigg Boss Season 8 Telugu : బిగ్‌బాస్ సీజన్-8 విజేతగా నిఖిల్.. రన్నరప్‌గా గౌతమ్..!
Nikhil Bigg Boss Winner : బిగ్‌బాస్ సీజన్ 8 విజేతగా నిఖిల్ నిలిచాడు. కన్నడ మలియక్కల్ నిఖిల్ బిగ్‌బాస్ సీజన్ 8 ట్రోఫీని సొంతం చేసుకున్నాడు. రన్నరప్‌గా గౌతమ్ నిలిచాడు.

Nikhil Maliyakkal winner of Bigg Boss Season 8 Telugu
Nikhil Bigg Boss Winner : బిగ్‌బాస్ తెలుగు సీజన్ 8 విజేత ఎవరో తేలిపోయింది. 105 రోజుల పాటు సాగిన ఈ రియాల్టీ గేమ్ షో నేటితో ముగిసింది. కన్నడ మలియక్కల్ నిఖిల్ బిగ్‌బాస్ సీజన్ 8 విజేతగా నిలిచాడు. గౌతమ్ రన్నరప్‌గా నిలిచాడు. బిగ్‌బాస్ 8 సీజన్ గ్రాండ్ ఫినాలేకు ముఖ్య అతిథిగా విచ్చేసిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ విజేత నిఖిల్‌కు ట్రోఫీ అందించారు.
అలాగే, రూ. 55 లక్షల ప్రైజ్‌మనీతో పాటు మారుతీ సుజుకీ డాజ్లింగ్ డిజైర్ కారును కూడా అందించారు. ఈ సందర్భంగా ఇప్పటివరకూ బిగ్‌బాస్ సీజన్‌లలో బిగ్ ప్రైజ్ మనీగా హోస్ట్ నాగార్జున ప్రకటించారు. బిగ్‌బాస్ 8 సీజన్‌లో మొత్తం 22 మంది కంటెస్టెంట్స్ షోలో పాల్గొన్నారు.
ఫినాలే వీక్‌లో గౌతమ్, ప్రేరణ, నిఖిల్, అవినాష్, నబీల్ ఫైనలిస్ట్‌గా నిలిచారు. గోరింటాకు సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నిఖిల్ ఫైనల్ రేసులో విన్నర్‌గా నిలవగా, గౌతమ్ రన్నరప్‌గా నిలిచాడు. విన్నర్ నిఖిల్ రూ.55 లక్షల ప్రైజ్‌మనీ, మారుతీ సుజూకీ కారును అందుకున్నాడు.
వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ అయి రన్నరప్‌గా నిలిచిన గౌతమ్ నిఖిల్‌కు గట్టి పోటీనిచ్చాడు. ఎలిమినేట్ అవుతాడనుకున్న గౌతమ్ టైటిల్ రేస్‌లో దూసుకొచ్చాడు. తెలుగు ప్రేక్షకుల్లో చాలామంది గౌతమ్ విన్నర్ అవుతున్నాడని భావించినప్పటికీ కన్నడ మలియక్కల్ నిఖిల్ బిగ్‌బాస్ సీజన్ 8 తెలుగు ట్రోఫీని దక్కించుకున్నాడు.

Nikhil Maliyakkal winner
ఫైనల్ వరకు టఫ్ ఫైట్ ఇచ్చిన గౌతమ్ తక్కువ ఓటింగ్ తేడాతోనే రన్నరప్ అయ్యాడు. నిఖిల్ ఓటింగ్ అధికంగా రావడంతో విజేతగా నిలిచాడు. దాంతో గౌతమ్ రన్నరప్‌గా సరిపెట్టుకున్నాడు.
నేను బయటి వ్యక్తిని కాదు.. మీ ఇంటివాడిని : నిఖిల్
విన్నర్ నిఖిల్ మాట్లాడుతూ.. ‘‘అందరికీ ధన్యవాదాలు. ఇదో అద్భుతమైన జర్నీ. నన్ను ప్రత్యక్షంగా పరోక్షంగా చాలా మంది సపోర్ట్ చేస్తూ వచ్చారు. ప్రతి ఒక్కరి దగ్గర నుంచి నేర్చుకున్నాను. అందరిలో ఒకడిగా నిలిచాను. నన్ను ఎంతో ప్రేమించి, ప్రోత్సహించిన తెలుగు ప్రేక్షకులకు చాలా ధన్యవాదాలు.
నేను బయట వ్యక్తిని కాదని.. మీ ఇంటి వాడినని మరోసారి నిరూపించారు. నన్ను గెలిచిపించినందుకు అందరికి ధన్యవాదాలు. మీరిచ్చిన ప్రోత్సాహంతోనే సినీఇండస్ట్రీలో ముందుకు కొనసాగుతాను. ఈ బిగ్‌బాస్ ట్రోఫీ అమ్మకు అంకింతం చేస్తున్నా’’ అంటూ నిఖిల్ పేర్కొన్నాడు.
రన్నరప్ గౌతమ్ మాట్లాడుతూ.. ‘బిగ్ బాస్ సీజన్ 8లో ఇక్కడి వరకూ తీసుకొచ్చిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. అమ్మానాన్న.. విజేత కాలేకపోయినందుకు నేనేం బాధపడడం లేదు. నా జీవితంలో వేసే ప్రతి ఒక్క అడుగు మీరు గర్వపడేలా ఉంటుంది’ అని చెప్పుకొచ్చాడు.
Read Also : మంచు ఫ్యామిలీలో మరోసారి వివాదం.. పోలీసులకు మంచు మనోజ్ మళ్లీ ఫిర్యాదు