Nithiin : బైక్ మీద నుంచి స్కిడ్ అయి కాలు ఫ్రాక్చర్.. అయినా రెండు రోజులు సాంగ్ షూట్..
నితిన్ తమ్ముడు సినిమాతో జులై 4న రాబోతున్నాడు.

Nithiin Leg Fracture Even he Completed Dance Shoot
Nithiin : మన హీరోలు షూటింగ్స్ సమయంలో ఏదైనా గాయాలు జరిగినా చికిత్స తీసుకొని మళ్ళీ షూటింగ్ కి వెళ్ళిపోతారు. షూటింగ్ కి బ్రేక్ ఇచ్చేంత గాయాలు అయితే కచ్చితంగా రెస్ట్ తీసుకుంటారు. అయితే నితిన్ మాత్రం కాలు ఫ్రాక్చర్ అయి షూటింగ్ కి బ్రేక్ ఇవ్వాల్సి వచ్చినా అలాగే షూట్ చేసాడట.
నితిన్ తమ్ముడు సినిమాతో జులై 4న రాబోతున్నాడు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నిర్మాత దిల్ రాజుతో స్పెషల్ ఇంటర్వ్యూ చేసాడు. ఈ ఇంటర్వ్యూలో భాగంగా దిల్ సినిమా జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకున్నారు. దిల్ రాజు మొదటి సినిమా దిల్ అని తెలిసిందే.
Also See : Kevvu Kartheek : భార్యతో కలిసి జబర్దస్త్ కెవ్వు కార్తీక్.. స్వర్ణగిరి ఆలయంలో.. ఫొటోలు..
దిల్ రాజు నితిన్ తో మాట్లాడుతూ.. దిల్ సినిమా ఒక పాట షూటింగ్ దుబాయ్ లో జరుగుతున్నప్పుడు బైక్ స్కిడ్ అయి నీ కాలు మీద పడింది. హెయిర్ లైన్ ఫ్రాక్చర్ అయింది. ఆ రోజు మధ్యాహ్నం నుంచి షూటింగ్ ఆపేశాం. రెండు రోజుల్లో మనం వెళ్ళిపోవాలి. వినాయక్ ఠాగూర్ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉన్నాడు. వెళ్లిపోవాలా, రెండు రోజులు వేస్ట్ చేయాలా అని ఆలోచించి డ్యాన్స్ మాస్టర్ శంకర్ దగ్గరికి వెళ్లి కాలు కిందపెట్టకుండా, కాలు కదల్పకుండా ఏదైనా కొత్తగా ప్లాన్ చెయ్ అని చెప్పాను. చెప్పినట్టే చేసి రెండు రోజులు పాట షూట్ చేసారు శంకర్ మాస్టర్. తర్వాత సినిమా రిలీజ్ కి ముందు రామోజీ ఫిలిం సిటీలో కొన్ని బ్యాలెన్స్ షాట్స్ తీసుకున్నాం. మొదటి సినిమా అయినా ఏదైనా సంఘటన జరిగితే ఎలా రియాక్ట్ అవ్వాలి అని అప్పట్నుంచే నేర్చుకున్నాను అని తెలిపారు.
దిల్ సినిమాలో ‘పెద్దలొద్దంటున్నా.. ప్రేమ తప్పని అన్నా..’ అనే సాంగ్ ని దుబాయ్ లో షూట్ చేసారు. ఇందులో కొంత భాగం ఓ బోట్ లో హీరో హీరోయిన్ ఉండి కదులుతూ ఉంటారు. అదంతా నితిన్ కాలు ఫ్రాక్చర్ అయ్యాక షూట్ చేసారని తెలుస్తుంది. అలాగే రామోజీ ఫిలిం సిటీలో కూడా కొన్ని షాట్స్ ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తానికి నితిన్ కాలు ఫ్రాక్చర్ అయినా బాగానే కష్టపడ్డాడు సినిమా కోసం.
Also Read : NTR – Dil Raju : ఎన్టీఆర్ ని దిల్ రాజు ఏమని పిలుస్తాడా తెలుసా? కొడాలి నాని పిలవడం చూసి..
కాలు ఫ్రాక్చర్ అయినా నితిన్ చేసిన సాంగ్ ఇదే..