రజినీ కూతురిగా నివేదా థామస్
సెంట్‌గా మలయాళీ ముద్దుగుమ్మ నివేదా థామస్ దర్బార్ సెట్‌లోకి ఎంటర్ అయ్యింది. ఈ సినిమాలో నివేదా రజినీ కూతురుగా కనిపించనుంది.

సెంట్‌గా మలయాళీ ముద్దుగుమ్మ నివేదా థామస్ దర్బార్ సెట్‌లోకి ఎంటర్ అయ్యింది. ఈ సినిమాలో నివేదా రజినీ కూతురుగా కనిపించనుంది.
సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్, లేడీ సూపర్ స్టార్ నయనతార జంటగా, టాప్ డైరెక్టర్ ఏ.ఆర్.మురగదాస్ డైరెక్షన్‌లో, లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న సినిమా ‘దర్బార్’. ఈ మూవీ షూటింగ్ గతకొద్ది రోజులుగా ముంబాయిలో జరుగుతుంది. ఇటీవలే నయనతార షూటింగ్‌లో జాయిన్ అయ్యింది. రీసెంట్‌గా మలయాళీ ముద్దుగుమ్మ నివేదా థామస్ కూడా దర్బార్ సెట్‌లోకి ఎంటర్ అయ్యింది. ఈ సినిమాలో నివేదా రజినీ కూతురుగా కనిపించనుంది. ఇంతకుముందు పాపనాశనం సినిమాలో కమల్ హాసన్ కూతురిగా నటించింది నివేదా..
ఆమెతో పాటు కమెడియన్ యోగిబాబు కూడా షూట్‌లో జాయిన్ అయ్యాడు. దాదాపు 25 ఏళ్ళ తర్వాత రజినీ ఈ సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనుండడం, ప్రముఖ సినిమాటోగ్రాఫర్ సంతోష్ శివన్, రజీని సినిమాకి 25 ఏళ్ళ తర్వాత కలిసి పనిచెయ్యడం విశేషం. 2020 సంక్రాంతికి దర్బార్ ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సినిమాకి ఎడిటింగ్ : శ్రీకర్ ప్రసాద్, సంగీతం : అనిరుధ్, లిరిక్స్ : వివేక్.