Akhanda: ఆగని మేనియా.. రూ.100 కోట్ల వైపు అఖండ జాతర!
సెకండ్ వేవ్ తర్వాత రిలీజ్ అయిన అఖండ సినిమా ఫాన్స్ కి మరోసారి మాస్ పూనకాలు తెప్పించింది. బాలకృష్ణ-బోయపాటి కాంబినేషన్లో హ్యాట్రిక్ మూవీగా రిలీజ్ అయిన అఖండ అదిరిపోయే సక్సెస్ తో..

Akhanda
Akhanda: సెకండ్ వేవ్ తర్వాత రిలీజ్ అయిన అఖండ సినిమా ఫాన్స్ కి మరోసారి మాస్ పూనకాలు తెప్పించింది. బాలకృష్ణ-బోయపాటి కాంబినేషన్లో హ్యాట్రిక్ మూవీగా రిలీజ్ అయిన అఖండ అదిరిపోయే సక్సెస్ తో దూసుకుపోతోంది. భారీ ఎక్స్ పెక్టేషన్స్ తో ధియేటర్లోకొచ్చిన అఖండ మూవీ అదే స్పీడ్ తో బాక్సాఫీస్ బద్దలు కొడుతోంది. మరి 100కోట్ల క్లబ్ లో జాయిన్ అవ్వడానికి దగ్గరలో ఉన్న అఖండ కలెక్షన్ డీటెయిల్స్ పై ఓ లుక్కేద్దాం.
New Film Releases: మూడో గండం.. భారీ సినిమాలకు ఒమిక్రాన్ వర్రీ!
భారీ అంచనాలతో పోయిన గురువారం రిలీజ్ అయిన అఖండ మూవీలో బాలయ్య డైలాగ్స్ కి, యాక్షన్ కి థియేటర్లు దద్దరిల్లిపోతున్నాయి. సెకండ్ వేవ్ తర్వాత ధియేటర్లో ఈ రేంజ్ లో హడావిడి చేసిన సినిమా ఈ లెవల్లో సందడి చేసిన సినిమా అన్ డౌటెడ్ గా అఖండ అనే చెప్పాలి. బాలయ్య-బోయపాటి కాంబినేషన్లో మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కి భారీగా రిలీజ్ అయిన అఖండ.. అదిరిపోయే సక్సెస్ తో 90 కోట్ల కలెక్షన్లు క్రాస్ అయ్యి 100కోట్ల క్లబ్ లో చేరడానికి రెడీ అవుతోంది.
Pushpa: బన్నీ కెరీర్‌లో బిగ్గెస్ట్ గేమ్ చేంజర్‌గా పుష్ప!
రిలీజ్ అయ్యి వారం రోజులవుతున్నా అఖండ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. అంతేకాదు రోజురోజుకీ సినిమా కలెక్షన్లు కూడా ఎక్స్ పెక్ట్ చేసిన రేంజ్ కంటే పెరిగిపోతున్నాయి. ఇప్పటికే ఏపీ, తెలంగాణలో 70కోట్లు కలెక్ట్ చేసిన అఖండ.. కర్ణాటకతో పాటు మిగతా స్టేట్స్ లో దాదాపు 4కోట్లు కలెక్ట్ చేసింది. అంతేకాదు.. ఓవర్సీస్ లో 10 కోట్లు క్రాస్ చేస్తోంది. ఇలా వారం కూడా కాకుండానే 90కోట్లు క్రాస్ చేస్తున్న అఖండ.. 100 కోట్ల క్లబ్ లో జాయిన్ అవ్వడానికి చాలా దగ్గరలో ఉంది.
Radhe Shyam: విజువల్ ట్రీట్.. దుమ్మురేపుతున్న సోచ్ లియా సాంగ్!
అఖండ మూవీతో బాలయ్య మాస్ స్ట్రెన్త్ మరోసారి ప్రూవ్ చేసుకున్నారు. బోయపాటి స్టైల్ హెవీ యాక్షన్ సీన్స్ కి తోడు.. బాలయ్య పవర్ ఫుల్ డైలాగ్స్ కి ఫుల్ ఇంప్రెస్ అయిపోతున్నారు జనాలు. మాస్ యాక్షన్ తో ఆడియన్స్ ని థియేటర్లకు పుల్ చెయ్యగలిగిన అఖండ మూవీపైనే ఇప్పుడు అందరి కాన్సన్ ట్రేషన్. అందుకే అఖండ మూవీ రీమేక్ మీద చర్చలు జరుగుతున్నాయి. అఖండను బాలీవుడ్ లో రీమేక్ చెయ్యడానికి ఇద్దరు స్టార్ హీరోలు ఇంట్రస్ట్ చూపిస్తున్నట్టు టాక్ నడుస్తోంది.