పోలాండ్ దేశంలో లడ్డు వేలంపాటలో వచ్చిన డబ్బుల్ని.. వరద బాధితులకు సాయం చేసిన NRI డిస్ట్రిబ్యూటర్స్..

బయట దేశాల్లో కూడా ఇండియన్స్ ఉన్నచోట వినాయకచవితి ఘనంగా చేస్తారని తెలిసిందే.

పోలాండ్ దేశంలో లడ్డు వేలంపాటలో వచ్చిన డబ్బుల్ని.. వరద బాధితులకు సాయం చేసిన NRI డిస్ట్రిబ్యూటర్స్..

NRI distributors helped the flood victims with the money received from the auction of laddu in Poland

Updated On : September 19, 2024 / 3:48 PM IST

బయట దేశాల్లో కూడా ఇండియన్స్ ఉన్నచోట వినాయకచవితి ఘనంగా చేస్తారని తెలిసిందే. పోలాండ్‌ దేశ రాజధాని వార్సా నగరంలో ఇటీవల వినాయకచవితి ఉత్సవాలు గ్రాండ్ గా చేసారు. అక్కడి ఈ ఉత్సవాలని అక్కడి డిస్ట్రిబ్యూటర్స్ కాట్రగడ్డ చందు, విజయ్, రెడ్డి రామసతీశ్.. పలువురు నిర్వహించారు.

అక్కడ లడ్డు వేలంపాటని వేయగా వచ్చిన లక్ష 50 వేల రూపాయలు, అలాగే దేవుని హుండీ, కానుకల రూపేణ వచ్చిన 50,000 రూపాయిలు మొత్తం కలిపి 2 లక్షల రూపాయిలు వచ్చాయి. వాటిని ఏపీ, తెలంగాణ వరద బాధితుల కోసం ఇవ్వాలని నిర్ణయించుకున్నారు.

Salman Khan : స‌ల్మాన్ ఖాన్ తండ్రికి మ‌హిళ‌ బెదిరింపు

రెండు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్స్ కి చెరో లక్ష చొప్పున ఇస్తామని అక్కడి నిర్వాహకులు తెలిపారు. ఇక అక్కడ వినాయకచవితి ఉత్సవాలు, నిమజ్జనం కార్యక్రమాల్లో అక్కడి భారతీయులే కాక పోలాండ్ దేశ ప్రజలు కూడా భారీగా పాల్గొన్నారు.