NTR : బామ్మర్ది సినిమా ప్రమోషన్స్ కోసం రంగంలోకి ఎన్టీఆర్.. మ్యాడ్ ట్రైలర్ రిలీజ్..
తాజాగా మ్యాడ్ సినిమా ట్రైలర్ ని ఎన్టీఆర్ రిలీజ్ చేశారు. తన బామ్మర్ది మొదటి సినిమా కోసం ఎన్టీఆర్ రంగంలోకి దిగి ప్రమోషన్ చేశారు.

NTR Launch his Brother in Law Narne Nithin Movie MAD Trailer
MAD Trailer : సితార ఎంటర్టైన్మెంట్స్, ఫ్యార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ లో తాజాగా ఓ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ సినిమా రాబోతుంది. ఎన్టీఆర్ బామ్మర్ది నార్నె నితిన్ తో పాటు సంగీత్ శోభన్, రామ్ నితిన్, గౌరీ ప్రియా రెడ్డి, రఘుబాబు, రచ్చ రవి, మురళీధర్ గౌడ్.. తదితరులు ముఖ్య పాత్రల్లో ‘మ్యాడ్’ అనే సినిమా రాబోతుంది. కళ్యాణ్ శంకర్ ఈ సినిమాని డైరెక్ట్ చేశాడు. ఇటీవల టీజర్ లాంచ్ చేసి ప్రమోషన్స్ మొదలుపెట్టారు చిత్రయూనిట్. అక్టోబర్ 6న మ్యాడ్ సినిమా రిలీజ్ కాబోతుంది.
తాజాగా మ్యాడ్ సినిమా ట్రైలర్ ని ఎన్టీఆర్ రిలీజ్ చేశారు. తన బామ్మర్ది మొదటి సినిమా కోసం ఎన్టీఆర్ రంగంలోకి దిగి ప్రమోషన్ చేశారు. చిత్రయూనిట్ అంతా ఎన్టీఆర్ ని కలవగా ఎన్టీఆర్ ట్రైలర్ లాంచ్ చేసి అల్ ది బెస్ట్ చెప్పారు. దీంతో సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి. ఎన్టీఆర్ స్వయంగా బామ్మర్ది కోసం రావడంతో ఎన్టీఆర్ అభిమానులు కూడా ఈ సినిమాని ప్రమోట్ చేస్తూ నార్నె నితిన్ కి సపోర్ట్ ఇస్తున్నారు.
ఇక మ్యాడ్ సినిమా ట్రైలర్ ఆద్యంతం కామెడీగా సాగింది. కాలేజీలో ఉండే కుర్రాళ్ళు వాళ్ళు చేసే కామెడీ, గొడవల నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా యూత్ ని టార్గెట్ చేసుకొని ఈ సినిమాని తెరకెక్కించారు. మరి ఈ సినిమా ప్రేక్షకులని ఏ రేంజ్ లో మెప్పిస్తుందో చూడాలి.