Oke Oka Jeevitham: సెన్సార్ పనులు ముగించుకున్న ఒకే ఒక జీవితం
యంగ్ హీరో శర్వానంద్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఒకే ఒక జీవితం’ ఇప్పటికే ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాను సెప్టెంబర్ 9న ప్రపంచవ్యాప్తంగా మంచి బజ్ మధ్య రిలీజ్ చేస్తుండగా, తాజాగా ఈ చిత్రం సెన్సార్ పనులు కూడా ముగించుకుంది.

Oke Oka Jeevitham Completes Censor Work
Oke Oka Jeevitham: యంగ్ హీరో శర్వానంద్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఒకే ఒక జీవితం’ ఇప్పటికే ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ చేసింది. ఫీల్‌గుడ్ కంటెంట్‌తో, సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్‌తో ఈ సినిమాను దర్శకుడు శ్రీకార్తిక్ రూపొందించగా, ఈ సినిమా టీజర్, ట్రైలర్లు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యాయి.
Oke Oka Jeevitham: ఒకే ఒక జీవితం ట్రైలర్.. సైఫై డ్రామాలో శర్వా అదరగొట్టాడు!
ఇక ఈ సినిమాలో మదర్ సెంటిమెంట్‌ను ప్రేక్షకుల మనసుల్ని హత్తుకునేలా చిత్ర యూనిట్ చూపించనుందని ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్స్‌లో మనకు అర్థమవుతోంది. అయితే ఈ సినిమాను సెప్టెంబర్ 9న ప్రపంచవ్యాప్తంగా మంచి బజ్ మధ్య రిలీజ్ చేస్తుండగా, తాజాగా ఈ చిత్రం సెన్సార్ పనులు కూడా ముగించుకుంది. ‘ఒకే ఒక జీవితం’ చిత్రానికి సెన్సార్ బోర్డు క్లీన్ ‘యూ’ సర్టిఫికెట్‌ను జారీ చేసింది. ఈ సినిమాలోని కంటెంట్ ప్రేక్షకులను ఖచ్చితంగా ఆకట్టుకుంటుందని సెన్సార్ సభ్యులు చిత్ర యూనిట్‌ను అభినందించారట.
Oke Oka Jeevitham: ఒకే ఒక జీవితం.. వచ్చేది అప్పుడే!
తమ సినిమాకు సెన్సార్ సభ్యుల నుండి పాజిటివ్ ఫీడ్‌బ్యాక్ రావడంతో ఈ సినిమా విజయంపై చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఇక ఈ సినిమాలో శర్వానంద్‌తో పాటు రీతూ వర్మ, వెన్నెల కిషోర్, ప్రియదర్శి, అమలా అక్కినేని ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నాడు. మరి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో తెలియాలంటే సెప్టెంబర్ 9 వరకు వెయిట్ చేయాల్సిందే.