KRAMP : K-ర్యాంప్ నుంచి ‘ఓనమ్’ పాట వచ్చేసింది.. అదిరిపోయే స్టెప్పులతో ఇరగదీసిన కిరణ్ అబ్బవరం, యుక్తి తరేజా..
హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న సినిమా " K-ర్యాంప్".

Onam Song Lyrical Video from KRAMP movie
హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న సినిమా ” K-ర్యాంప్”. యుక్తి తరేజా కథానాయిక. జైన్స్ నాని దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్ బ్యానర్‌ల మీద రాజేష్ దండ, శివ బొమ్మకు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీపావళి సందర్భంగా అక్టోబర్ 18న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఈ క్రమంలో చిత్ర బృందం ప్రమోషనల్ కార్యక్రమాలను మొదలుపెట్టింది. అందులో భాగంగా తాజాగా ‘ఓనమ్’ లిరికల్ సాంగ్ విడుదల చేసింది. ఈ పాటకు సురేంద్ర కృష్ణ లిరిక్స్ అందించగా సాహితీ చాగంటితో కలిసి పాడారు మ్యూజిక్ డైరెక్టర్ చేతన్ భరద్వాజ్.
‘ ఇన్ స్టా ఆపేశానే, ట్విట్టర్ మానేశానే, నీకే ట్యాగ్ అయ్యానే అంటూ ఈ పాట సాగుతోంది. ఈ పాటలో కిరణ్ అబ్బవరం, యుక్తి తరేజా డాన్స్ ఇరగదీశారు.