Naatu Naatu: నాటు నాటు సాంగ్‌కు పాకిస్థానీ నటి స్టెప్పులు.. అదిరిపోయిందిగా!
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సన్సేషన్ క్రియేట్ చేసిందో మనం చూశాం. ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌లు కలిసి నటించడంతో ఈ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఇక ఈ సినిమాలోని పాటలకు ఎలాంటి రెస్పాన్స్ దక్కిందో అందరికీ తెలిసిందే.

Pakistani Actress Hania Aamir Grooves To Naatu Naatu Song
Naatu Naatu: దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సన్సేషన్ క్రియేట్ చేసిందో మనం చూశాం. ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌లు కలిసి నటించడంతో ఈ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఇక ఈ సినిమాలోని పాటలకు ఎలాంటి రెస్పాన్స్ దక్కిందో అందరికీ తెలిసిందే.
Naatu Naatu Song : ‘నాటు నాటు’ ఆస్కార్ నామినేషన్స్ పై ప్రముఖుల ప్రశంసలు..
ముఖ్యంగా ఈ సినిమాలోని ‘నాటు నాటు’ సాంగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ పాటకు ప్రతిష్టాత్మకమైన గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ రావడంతో పాటు అత్యంత విశిష్టమైన ఆస్కార్ అవార్డుల నామినేషన్ కూడా దక్కింది. దీంతో ఈ సినిమాలోని ‘నాటు నాటు’ సాంగ్ అత్యంత ప్రజాదరణ పొందిన పాటగా చరిత్ర సృష్టించింది. ఇక ఈ పాటకు సామాన్య ప్రజల దగ్గర్నుండి మొదలుకొని, సెలెబ్రిటీల వరకు ఈ సాంగ్‌కు స్టెప్పులు వేస్తున్నారు.
Naatu Naatu song : నాటు నాటు సాంగ్‌ని బాగానే వాడుకుంటున్నారుగా.. జైపూర్ పోలీసుల వినూత్న ప్రమోషన్స్..
తాజాగా పాకిస్థానీ నటి హనియా అమీర్ ఓ వివాహ వేడుకలో ‘నాటు నాటు’ పాటకు వేసిన స్టెప్పులు నెట్టింట తెగ హల్చల్ చేస్తున్నాయి. నాటు నాటు సాంగ్‌కు ఈ బ్యూటీ చేసిన డ్యాన్స్ స్టెప్పులు ప్రస్తుతం బాగా వైరల్ అవుతుండటంతో అమ్మడు చేసిన ఈ డ్యాన్స్‌ను నెటజెన్లు తెగ ఎంజాయ్ చేస్తున్నారు.
View this post on Instagram