Pavithra Lokesh : నన్ను తప్పుగా చూపించి నా కెరీర్‌పై బ్లాక్ మార్క్ పెట్టాలనున్నారు.. ఆ సమయంలో నరేశ్ గారే..

నరేష్, పవిత్ర పలు ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాను మరింత ప్రమోట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పవిత్ర లోకేశ్ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

Pavithra Lokesh : నన్ను తప్పుగా చూపించి నా కెరీర్‌పై బ్లాక్ మార్క్ పెట్టాలనున్నారు.. ఆ సమయంలో నరేశ్ గారే..

Pavithra Lokesh comments on relation with Naresh

Updated On : May 24, 2023 / 10:00 AM IST

Naresh : గత కొంతకాలంగా నరేశ్ – పవిత్ర జంట టాలీవుడ్ లో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం వారిద్దరూ పెళ్లి చేసుకోకపోయినా కలిసే ఉంటున్నామని ఇటీవల తెలిపారు. ఇక వాళ్ళిద్దరూ కలిసి జంటగా నటించిన సినిమా మళ్ళీ పెళ్లి(Malli Pelli). మొదటి నుంచి కూడా ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. నరేశ్ – పవిత్ర నిజ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగానే ఈ సినిమా తెరకెక్కినట్టు సమాచారం.

చిత్రయూనిట్ ప్రమోషన్స్ ని భారీగానే చేస్తున్నారు. ఇప్పటికే ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా గ్రాండ్ గా నిర్వహించారు చిత్రయూనిట్. నరేష్, పవిత్ర పలు ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాను మరింత ప్రమోట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పవిత్ర లోకేశ్ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

పవిత్ర లోకేశ్ మాట్లాడుతూ.. సమాజంలో చాలా నియమ నిబంధనలు ఉన్నాయి. సమాజంలో ఎవరి ఆలోచన, అభిప్రాయాలు వాళ్ళకుంటాయి. మా విషయంలో కొన్ని సంఘటనలు జరిగాయి. నా విషయానికొస్తే కొంతమంది పరిస్థితులను అడ్డుపెట్టుకొని నన్ను తప్పుగా చూపించారు. నాకు హాని కలిగించాలని చూశారు. నా కెరీర్ పై బ్లాక్ మార్క్ పెట్టాలని చూశారు. అలాంటి పరిస్థితి నుంచి బయటకు రావడం చాలా కష్టం. నాకు ఆత్మహత్య ఆలోచనలు కూడా వచ్చాయి. కానీ అలాంటి పరిస్థితి నుంచి బయటకు వచ్చానంటే కారణం నరేశ్ గారే. ఆయనే నాకు అండగా నిలబడ్డారు, నేను ఉన్నాను అంటూ నాకు సపోర్ట్ ఇచ్చారు అని తెలిపింది.

Theatrical Releases : ఈ వారం థియేటర్స్ లో రిలీజయ్యే తెలుగు సినిమాలు ఇవే..

అలాగే నరేశ్ పవిత్రల రిలేషన్, నరేశ్ ఫ్యామిలీ తమ గురించి ఏమనుకున్నారో తెలుపుతూ… నేను విజయ నిర్మల గారిని చివరి స్టేజిలో ఉన్నప్పుడు కలిశాను. ఆమెతో ఎక్కువ మాట్లాడలేదు. కానీ కృష్ణ గారిని కలిసి చాలా సేపు మాట్లాడాను. మహేష్ ని కూడా కలిశాను. నరేశ్ కుటుంబ సభ్యులంతా మా బంధాన్ని ఆహ్వానించారు అని తెలిపింది.