Pawan Kalyan Fans : లంగర్ హౌస్ అలంకార్ థియేటర్లో పవన్ ఫ్యాన్స్ వీరంగం.. బీరు బాటిళ్లతో దాడి..
పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఆయన ఫ్యాన్స్ చేసే హంగామా గురించి అందరికి తెలిసిందే. థియేటర్స్ వద్ద, థియేటర్స్ లో ఫ్యాన్స్ హంగామా చేస్తారు. అయితే కొంతమంది అభిమానులు మాత్రం హద్దు దాటి రచ్చ రచ్చ చేస్తారు.

Pawan Kalyan Fans attack on Theater Employees while Bro Movie Screening
Pawan Kalyan Fans : పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్(Sai Dharam Tej) కలిసి నటించిన బ్రో(Bro) సినిమా ఇటీవల జులై 28న థియేటర్స్ లోకి వచ్చి భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. అటు పవన్ ఫ్యాన్స్ ని, ఇటు ఫ్యామిలీ ఆడియన్స్ ని మెప్పించింది ఈ సినిమా. ఇక మొదటి రోజే ఎవరూ ఊహించని రేంజ్ లో ప్రపంచవ్యాప్తంగా బ్రో సినిమా ఏకంగా 44 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించి అందర్నీ ఆశ్చర్యపరిచింది.
ఇక పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఆయన ఫ్యాన్స్ చేసే హంగామా గురించి అందరికి తెలిసిందే. థియేటర్స్ వద్ద, థియేటర్స్ లో ఫ్యాన్స్ హంగామా చేస్తారు. అయితే కొంతమంది అభిమానులు మాత్రం హద్దు దాటి రచ్చ రచ్చ చేస్తారు. తాజాగా బ్రో సినిమా రెండో రోజు హైదరాబాద్ లంగర్ హౌస్ లో ఉన్న అలంకార్ థియేటర్లో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వీరంగం సృష్టించారు.
బీర్ బాటిళ్లతో థియేటర్లోకి వచ్చి, మద్యం తాగుతూ సీసాలు పగలకొట్టి హాల్ చల్ చేశారు. అనంతరం వారిలో వారు గొడవపడి బీర్ బాటిల్ తో పరస్పరం కొట్టుకోవడంతో పాటు ఆ గొడవని ఆపడానికి వచ్చిన థియేటర్ సిబ్బందిపై దాడి చేశారు పవన్ ఫ్యాన్స్. దీంతో థియేటర్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వగా మద్యం తాగి థియేటర్లో గొడవ చేసిన ఆ యువకులను అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఈ ఘటన వైరల్ అవ్వగా పలువురు పవన్ ఫ్యాన్స్.. ఇలాంటి వాళ్ళ వల్లే పవన్ కి చెడ్డపేరు వస్తుందని కామెంట్స్ చేస్తున్నారు.