నా దేవుడు కరుణించాడు.. హ్యాట్రిక్ హిట్‌కు రెడీ!..

Pawan Kalyan – Bandla Ganesh: పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ వీరాభిమానుల్లో నటుడు, నిర్మాత బండ్ల గణేష్ ఒకరు.. పవన్‌ను తన దేవుడిగా చెప్పుకునే బండ్ల గణేష్ ముచ్చటగా మూడోసారి పవన్ కళ్యాణ్‌తో సినిమా చేయబోతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ప్రకటించారు.
‘‘నా బాస్ ఓకే చెప్పారు. మరోసారి ఆయనతో కలిసి పనిచేయబోతున్నాను. నా నెక్ట్స్ ప్రాజెక్ట్ ఆయనతో చేస్తున్నాను. నా కలలు నిజమయ్యాయి. నా దేవుడు పవన్ కళ్యాణ్‌కు ధన్యవాదాలు’’ అంటూ పవన్ కళ్యాణ్‌తో ఉన్న ఫొటోను షేర్ చేశారు బండ్ల గణేష్.
కాగా పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై పవన్ కళ్యాణ్, బండ్ల గణేష్ కాంబినేషన్‌లో ‘తీన్‌మార్’, ‘గబ్బర్ సింగ్’ సినిమాలు వచ్చాయి. ఇక ఇప్పుడు వీరి కాంబినేషన్‌లో ఎలాంటి సినిమా తెరకెక్కనుంది. ఎవరు డైరెక్ట్ చేస్తారు? అనే అంశాలు అందరిలోనూ ఆసక్తిగా మారాయి. 2015లో విడుదలైన ఎన్టీఆర్ ‘టెంపర్’ సినిమా తర్వాత బండ్ల గణేష్ నిర్మాణానికి దూరంగా ఉన్నారు. తన బాస్ పవన్ సినిమాతో తిరిగి రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు బండ్ల.
మరోవైపు ‘అజ్ఞాతవాసి’ తర్వాత కాస్త విరామం తీసుకున్న పవన్ వరుసగా సినిమాలు లైన్లో పెట్టారు. ‘వకీల్ సాబ్’, క్రిష్ సినిమా, హరీష్ శంకర్, సురేందర్ రెడ్డిలతో సినిమాలు ఫిక్స్ చేసిన పవర్‌స్టార్ ఇవి పూర్తయిన తర్వాత బండ్ల గణేష్ సినిమా చేయనున్నారు.
My boss said okay and once again my dreams come true .
Thank you my god @PawanKalyan ?. pic.twitter.com/x0s1nQy3Fy— BANDLA GANESH. (@ganeshbandla) September 28, 2020