Pawan Kalyan : పవన్ కళ్యాణ్ సినిమాకి నో చెప్పిన డైరెక్టర్.. కానీ ఫ్రెండ్ అడిగాడని..
ఆయన సినిమాలో ఛాన్స్ కోసం చాలా మంది ఆర్టిస్టులు ఎదురుచూస్తారు. (Pawan Kalyan)
 
                            Pawan Kalyan
Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని కలవడానికి ఫ్యాన్స్ ఎంతలా ఎదురుచూస్తారో ఆయన సినిమాలో ఛాన్స్ కోసం చాలా మంది ఆర్టిస్టులు అలాగే ఎదురుచూస్తారు. అయితే నటుడు, డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ మాత్రం పవన్ కళ్యాణ్ సినిమాలో ఛాన్స్ వస్తే నో చెప్పాడట. తర్వాత పవన్ కళ్యాణ్ ఇంకో సినిమాలో ఛాన్స్ రావడంతో డైరెక్టర్ కోసం ఓకే చేసాడట.(Pawan Kalyan)
రాహుల్ రవీంద్రన్ డైరెక్టర్ గా ది గర్ల్ ఫ్రెండ్ అనే సినిమాతో రాబోతున్నాడు. రష్మిక మెయిన్ లీడ్ లో నటించిన ఈ సినిమా నవంబర్ 7న రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇటీవల OG సినిమాలో నటించారు కదా, పవన్ కళ్యాణ్ సినిమా అనా, లేక క్యారెక్టర్ కోసమా అని అడగడంతో రాహుల్ ఆసక్తికర సమాధానం చెప్పాడు.
రాహుల్ రవీంద్రన్ సమాధానమిస్తూ.. నాకు గతంలోనే పవన్ కళ్యాణ్ గారి అత్తారింటికి దారేది సినిమాలో ఛాన్స్ వచ్చింది. కానీ నేను చేయలేదు. ఇప్పుడు OG లో చేయడానికి ముఖ్య కారణం సుజీత్. నా బెస్ట్ ఫ్రెండ్స్ లో సుజీత్ ఒకరు. అన్న ఒక రోల్ ఉంది చేయాలి అని అడగ్గానే ఓకే చెప్పాను. ఆ పాత్ర గురించి ఏమి అడగలేదు. అలాగే సుజీత్ దగ్గర చాలా ట్యాలెంట్ ఉంది. డైరెక్టర్ గా తన దగ్గర చాలా నేర్చుకోవచ్చు. సెట్ లో అతని వర్క్ చూడొచ్చు అని ఆ పాత్రని ఒప్పుకున్నాను.
నా సీన్స్ ఇంకా ఎక్కువే ఉంటాయి. కానీ చాలా సీన్స్ కట్ చేసారు. సినిమాలో నాకు భార్య కూడా ఉంది. సినిమా లేట్ అవుతుండటంతో, డేట్స్ ఇష్యూస్ తో, కొన్ని కారణాలతో ఆ సీన్స్ అన్ని ఎడిట్ చేసేసి నా పాత్రని మళ్ళీ మార్చారు. సినిమా మాత్రం అదిరిపోయింది. OG సినిమా థియేటర్లో బాగా ఎంజాయ్ చేశాను. సుజీత్ వర్క్ అదిరిపోయింది. సుజీత్ ని చూసి గర్వపడుతున్నాను అని అన్నారు.






