Pawan Kalyan : సమ్మర్ రేసులో పవన్ VS పవన్

మార్చి 28న తమ సినిమా రిలీజ్ చేయాలని చూస్తుంటే ఏప్రిల్ లేదా మే నెల అంటూ లీకులు ఇవ్వటం ఏంటంటూ హరిహర వీరమల్లు మేకర్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట.

Pawan Kalyan : సమ్మర్ రేసులో పవన్ VS పవన్

Updated On : October 21, 2024 / 10:04 PM IST

సినిమా తీయడం ఒక ఎత్తు. సీజన్‌కు తగ్గట్లుగా రిలీజ్‌ చేయడం ఇంకో ఎత్తు. దసరా, సంక్రాంతి, సమ్మర్ ఇలా కొన్ని ప్రత్యేక సమయాల్లో మూవీ రిలీజ్‌ అయితే..సక్సెస్ రేటు ఎక్కువ ఉంటుంది. కలెక్షన్స్ బాగా వస్తాయి. సాధారణంగా ఓ స్టార్ హీరో సినిమా రిలీజ్ టైమ్‌లో మరో స్టార్ హీరో పోటీ పడుతూ సినిమాను రిలీజ్ చేస్తుంటారు. ఎట్టి పరిస్థితుల్లో తమ సినిమానే ఫస్ట్ రిలీజ్ అవ్వాలని, తన సినిమాకే థియేటర్లు దక్కాలని చూస్తుంటారు. కానీ ఈ సారి పవన్ కల్యాణ్‌ సినిమాలే..బాక్సాఫీస్‌ దగ్గర పోటీ పడబోతున్నాయట.

హరి హర వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్.. ప్రస్తుతం పవన్ మూడు సినిమాలు చేస్తున్నారు. పొలిటికల్ యాక్టివ్‌గా ఉండటంతో మూవీ షూటింగ్ నెమ్మదిగా కొనసాగుతోన్నట్లు టాక్. అయితే ఉస్తాద్ భగత్ సింగ్‌ను పక్కన పెడితే హరిహర వీరమల్లు వర్సెస్ ఓజీ అన్నట్లు అయిపోయింది పరిస్థితి. హరిహర వీరమల్లు మూవీని 2025 మార్చి 28న రిలీజ్ చేస్తామని అధికారికంగా ప్రకటించారు. అయితే ఇప్పుడు ఓజీ సినిమా కూడా 2025 ఏప్రిల్ లేదా మేలో రిలీజ్ చేయాలని చూస్తున్నారట మేకర్స్. దీంతో హరిహర వీరమల్లు టీమ్ కాస్త డిసప్పాయింట్ అవుతున్నట్లు టాక్.

మార్చి 28న తమ సినిమా రిలీజ్ చేయాలని చూస్తుంటే ఏప్రిల్ లేదా మే నెల అంటూ లీకులు ఇవ్వటం ఏంటంటూ హరిహర వీరమల్లు మేకర్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. రెండు సినిమాల రిలీజ్ మధ్య కనీసం 5 నెలలు గ్యాప్ అయినా ఉండాలని హరిహర వీరమల్లు టీమ్ పవన్‌ను కోరుతుందట. దీంతో టాలీవుడ్‌లో పవన్ వర్సెస్ పవన్ అనే మాటలు వినిపిస్తున్నాయి. అయితే ఈ రెండు సినిమాల పంచాయితీని పవన్ ఎలా సాల్వ్ చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

బాలకృష్ణ ‘అన్‌‌‌‌స్టాపబుల్’ సీజన్ 4 మొదటి ఎపిసోడ్‌‌‌‌ గ్లింప్స్‌ వచ్చేసింది..