HariHara Veeramallu : హరిహర వీరమల్లు షూట్‌లో జాయిన్ అవుతున్న పవన్ కళ్యాణ్.. ఎప్పట్నించి అంటే..?

ఇటీవల హరిహర వీరమల్లు మూవీ షూట్ మొదలుపెట్టి పవన్ కళ్యాణ్ లేని సీన్స్ ని షూట్ చేశారు. పవన్ కూడా షూట్ లో జాయిన్ అవుదాము అనుకునేలోపు వరదలు వచ్చాయి.

HariHara Veeramallu : హరిహర వీరమల్లు షూట్‌లో జాయిన్ అవుతున్న పవన్ కళ్యాణ్.. ఎప్పట్నించి అంటే..?

Pawan Kalyan will Join HariHara VeeraMallu Movie Shoot Details Here

Updated On : September 14, 2024 / 10:00 AM IST

HariHara Veeramallu : పవన్ కళ్యాణ్ ఏపీ ఎన్నికల్లో గెలిచి డిప్యూటీ సీఎం అయ్యాక చేతిలో ఉన్న మూడు సినిమాలని ఎలాగైనా పూర్తిచేస్తానని చెప్పాడు. పవన్ ఫ్యాన్స్ OG, హరిహర వీరమల్లు సినిమాల కోసం ఎదురుచూస్తున్నారు. పవన్ డేట్స్ ఎప్పుడు ఇస్తే అప్పుడు షూట్ చేసేద్దామని మూవీ యూనిట్స్ ఎదురుచూస్తున్నాయి. ఇటీవల హరిహర వీరమల్లు మూవీ షూట్ మొదలుపెట్టి పవన్ కళ్యాణ్ లేని సీన్స్ ని షూట్ చేశారు. పవన్ కూడా షూట్ లో జాయిన్ అవుదాము అనుకునేలోపు వరదలు వచ్చాయి.

ఏపీలో వరదల వల్ల పవన్ బిజీ అయిపోయారు. దీంతో హరిహర వీరమల్లు షూట్ మళ్ళీ ఆగింది. తాజా సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాకు డేట్స్ ఇచ్చారంట. ఆ సినిమా షూట్ మొదలుకాబోతుంది. హరిహర వీరమల్లు సినిమా సెప్టెంబర్ 23 నుంచి షూటింగ్ మొదలు కానుందని సమాచారం. పవన్ కళ్యాణ్ సెప్టెంబర్ 23న షూట్ లో జాయిన్ అయి దాదాపు 20 రోజుల పాటు షూటింగ్ లో పాల్గొననున్నారని తెలుస్తుంది.

Also Read : Devara Pre Release Event : ‘దేవర’ ప్రీ రిలీజ్ ఈవెంట్ అప్పుడే.. వైరల్ అవుతున్న ప్లేస్, డేట్, గెస్ట్..

ఓ పక్క షూటింగ్ చేస్తూనే మరోపక్క ప్రభుత్వ కార్యక్రమాలు కూడా చూసుకోనున్నారు పవన్. దీంతో పవన్ ఫ్యాన్స్ సంతోషంతో పాటు సందేహం కూడా వ్యక్తం చేస్తున్నారు. ఈసారైనా పవన్ పూర్తిగా షూటింగ్ లో పాల్గొంటారా లేక మళ్ళీ ఏదైనా ప్రభుత్వ పనులు అడ్డం వచ్చి వచ్చి షూటింగ్ ఆగుతుందా అని ఆలోచిస్తున్నారు. ఒక వేల షూట్ మొదలుపెట్టి పవన్ జాయిన్ అయితే మాత్రం నెల రోజుల్లో షూట్ పూర్తిచేయడానికి ప్రయత్నిస్తారట మూవీ టీమ్.