మేనమామల మధ్య ‘మెగా మేనల్లుడు’
ఉప్పెన చిత్రంలోని ‘ధక్ ధక్ ధక్’ వీడియో సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..

ఉప్పెన చిత్రంలోని ‘ధక్ ధక్ ధక్’ వీడియో సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..
వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి హీరో హీరోయిన్లుగా, బుచ్చిబాబు సానా దర్శకుడిగా పరిచయమవుతున్న ‘ఉప్పెన’ చిత్రంలోని మొదటి పాటను ఇటీవల స్టార్ డైరెక్టర్ కొరటాల శివ రిలీజ్ చేసిన విషయం విదితమే. దేవి శ్రీప్రసాద్ సంగీతం సమకూర్చగా ఖవ్వాలీ తరహాలో సాగే ‘నీ కన్ను నీలి సముద్రం’ అనే ఈ పాట తక్కువ సమయంలోను 10 మిలియన్ వ్యూస్ దాటింది. (అచ్చు మేనమామలానే.. మెగా మేనల్లుడి ‘ధక్ ధక్ ధక్’ సాంగ్ చూశారా!)
ఇటీవలి కాలంలో బాగా పాపులర్ అయిన పాటల్లో ఒకటిగా నిలిచింది. మార్చి 9వ తేదిన ‘ధక్ ధక్ ధక్’ అంటూ సాగే వీడియో సాంగ్ రిలీజ్ చేయగా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ పాటలో ఓ సన్నివేశంలో సెలూన్ చెక్కతలుపులపై మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ల పెయింటింగ్ ఆర్ట్స్ కనిపిస్తాయి.
రెండు ఫోటోల మధ్య వైష్ణవ్ తేజ్ సెలూన్ బయటకూర్చుని ఉంటాడు. ఇద్దరు మేనమామల మధ్యలో మేనల్లుడు కూర్చుని ఉన్న స్టిల్ మెగాభిమానులను ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో సాంగ్ వైరల్ అవుతోంది. సుకుమార్ రైటింగ్స్ బ్యానర్‌తో కలిసి మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలు నిర్మిస్తున్న ‘ఉప్పెన’ చిత్రాన్ని 2020 ఏప్రిల్ 2న విడుదల చేయనున్నారు.
See Also | జాన్వీ కపూర్ వుమెన్స్ డే డ్యాన్స్.. రచ్చ రచ్చే..