Kushi Event : మీడియా, ఫ్యాన్స్‌పై పోలీసుల హడావిడి.. ఖుషి ఈవెంట్లో గందరగోళం.. హీరో, నిర్మాతల మనుషులని కూడా ఆపేసి..
నిన్న జరిగిన ఖుషి ఈవెంట్లో కొంతమంది పోలీసులు చాలా ఓవర్ యాక్షన్ చేశారని, మీడియాతో దురుసుగా మాట్లాడారని, ఫ్యాన్స్ ని కొట్టబోయారని, కొంతమంది దగ్గర ఫోన్స్ లాక్కొని హడావిడి చేశారని వార్తలు వస్తున్నాయి.

Police Over action on Media and Fans at Vijay Devarakonda Samantha Kushi Musical Event
Kushi Musical Concert : విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), సమంత (Samantha) జంటగా శివ నిర్వాణ(Shiva Nirvana) దర్శకత్వంలో లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న సినిమా ఖుషి. తాజాగా ఖుషి సినిమా ఆడియో లాంచ్ పేరుతో ఓ మ్యూజికల్ కాన్సర్ట్ నిర్వహించారు. ఆగస్టు 15న ఇండిపెండెన్స్ డే స్పెషల్ గా హైదరాబాద్ HICC కన్వెన్షన్ లో సాయంత్రం 6 గంటల నుంచి ఆడియో లాంచ్ పేరుతో ఈ మ్యూజికల్ కాన్సర్ట్ ని నిర్వహించారు ఖుషి చిత్రయూనిట్.
అయితే ఈ ఈవెంట్ కి భారీగా సమంత, విజయ్ దేవరకొండ అభిమానులు వచ్చారు. ఆరు గంటలకే హాల్ మొత్తం నిండిపోయిందని చాలా మందిని పోలీసులు బయటే వెయిట్ చేయించారు. ఫ్యాన్స్ తో పాటు మీడియా ప్రతినిధులని, చిత్రానికి పనిచేసిన వాళ్ళని, ఈవెంట్ మేనేజ్మెంట్ టీంకి సంబంధించిన వాళ్ళని కూడా లోపలికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఏకంగా నిర్మాతల స్నేహితులు, హీరో విజయ్ దేవరకొండ మేనేజర్ ని కూడా లోపలికి వెళ్లకుండా అడ్డుకోవడంతో ఈవెంట్ బయట పెద్ద గొడవే జరిగింది.
Kushi Musical Concert Event : ఖుషి మ్యూజికల్ కాన్సర్ట్ ఈవెంట్ ఫొటోలు..
సినిమా పీఆర్ టీం వచ్చి చెప్పినా బయట ఆపేసిన మీడియా వాళ్ళని లోపలికి పంపించలేదు పోలీసులు. ఇక అభిమానుల్లో సహనం నశించి లోపలికి వెళ్ళడానికి ట్రై చేస్తే పోలీసులు కొంతమందిని తోసేసి కొట్టబోయారు కూడా. ఈవెంట్ బయట పోలీసులు చేస్తున్న తతంగాన్ని కొంతమంది ఫోన్స్ లో వీడియో తీస్తుంటే వాళ్ళ దగ్గర ఫోన్స్ కూడా లాక్కున్నట్టు సమాచారం. హీరో మనుషులు అయితే ఏంటి, ప్రొడ్యూసర్ ఫ్రెండ్స్ అయితే ఏంటి అని పోలీసులు ఇష్టమొచ్చినట్టు మాట్లాడినట్టు తెలుస్తుంది. ఎవరు చెప్పినా కూడా లోపలి పంపించకపోవడంతో మీడియా వర్గాలు పోలీసులపై ఫైర్ అయ్యారు.
నిన్న జరిగిన ఖుషి ఈవెంట్లో కొంతమంది పోలీసులు చాలా ఓవర్ యాక్షన్ చేశారని, మీడియాతో దురుసుగా మాట్లాడారని, ఫ్యాన్స్ ని కొట్టబోయారని, కొంతమంది దగ్గర ఫోన్స్ లాక్కొని హడావిడి చేశారని వార్తలు వస్తున్నాయి. ఈ విషయంలో పోలీసులపై మీడియా తీవ్ర విమర్శలు చేస్తుంది. మీడియా వర్గాల్లో ఖుషి ఈవెంట్ పై తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఇక ఈవెంట్ మేనేజ్మెంట్ వాళ్ళు కూడా సరిగ్గా ఈవెంట్ నిర్వహించలేదని, సరైన ఏర్పాట్లు చేయలేదని కూడా విమర్శలు వస్తున్నాయి. మొత్తానికి ఖుషి ఆడియో లాంచ్ ఈవెంట్ లోపల విజయ్ దేవరకొండ, సమంత డ్యాన్సులు చేసి వైరల్ అయితే బయట పోలీసుల హడావిడి మీడియా వర్గాల్లో వైరల్ గా మారింది. మరి దీనిపై చిత్రయూనిట్ ఏమైనా స్పందిస్తారేమో చూడాలి.