Poonam Pandey : ఏ సెలబ్రిటీ చేయని సాహసం చేసిన పూనమ్ పాండే
సినిమాలో నటనకు ప్రజలు చప్పట్లు కొడతారు. నిజ జీవితంలో ఒక మంచి పని కోసం థ్రిల్ చేస్తే విమర్శలు గుప్పిస్తారు. పూనమ్ పాండే పరిస్థితి ప్రస్తుతం ఇదే.

Poonam Pandey
Poonam Pandey : పూనమ్ పాండే.. ఎప్పుడూ వివాదాలతో వార్తల్లో ఉంటారు. తాజాగా ఈ నటి సెన్సేషన్ క్రియేట్ చేశారు. క్యాన్సర్ పై ప్రజలకు అవగాహన కల్పించడం కోసం ఏ సెలబ్రిటీ చేయలేని పెద్ద సాహసం చేశారు.
Poonam Pandey : నేను బ్రతికే ఉన్నా..అందుకోసమే నేను చనిపోయినట్లు పోస్టు పెట్టా
పూనమ్ పాండే తన బోల్డ్ వీడియోలు.. ఫోటోలతో సోషల్ మీడియాలో ఒక రేంజ్‌లో విమర్శలు ఎదుర్కున్నారు. తన వ్యాఖ్యలతో చాలానే నెగెటివిటీని మూట కట్టుకున్నారు. సినిమాలకంటే సోషల్ మీడియాలోనే ఆమెకు ఫుల్ ఫేమ్ ఉంది. ఇదిలా ఉంచితే అకస్మాత్తుగా పాండే సర్వైకల్ క్యాన్సర్ తో చనిపోయారంటూ పోస్టు ప్రత్యక్షమైంది. మొదట ఈ వార్తను జనాలు నమ్మలేదు. కొద్దిరోజుల క్రితం కూడా సోషల్ మీడియాలో ఆమె చాలా ఆరోగ్యంగా కనిపించారని మాట్లాడారు. పబ్లిసిటీ కోసం పాండే ఎలాంటి పనులైనా చేస్తారంటూ కామెంట్స్ చేశారు. పాండే మేనేజర్ ఆమె చనిపోయినట్లు కన్ఫమ్ చేయడంతో ఇక నిజమని నమ్మారు. దేశమంతా క్యాన్సర్ గురించి చర్చించుకోవడం మొదలుపెట్టారు. అనేక వెబ్ సైట్లు సర్వైకల్ క్యాన్సర్ పట్ల జాగ్రత్తలు సూచిస్తూ వార్తలు రాశాయి. ఎక్స్‌పర్ట్స్ అనేక సలహాలు సూచనలు చేశారు. రోజు రోజంతా పాండే మరణం.. సర్వైకల్ క్యాన్సర్ ఈ రెండు అంశాల చుట్టూ తిరిగాయి.
Poonam Pandey : పూనమ్ పాండే వార్తల్లో నిలిచిన ప్రధాన వివాదాలు ఇవే..
ఈ స్టంట్ తర్వాత ఎదురయ్యే పరిణామాలను ముందుగానే ఊహించి పాండే సిద్ధమైనట్లు అనిపిస్తోంది. పాండే చేసిన పని ఒక రకంగా మంచిదే అయినా జనం మాత్రం ఎంచుకున్న పద్ధతి సరిగా లేదంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. నిజానికి ఇదే సెలబ్రిటీ అందంగా తయారై ఒక వీడియో ద్వారా క్యాన్సర్ గురించి మాట్లాడితే ఇంతలా జనాల పట్టించుకునేవారా? అనే చర్చ కూడా జరుగుతోంది. గతంలో అనేకమంది సెలబ్రిటీలు క్యాన్సర్‌పై అవగాహన కల్పించారు. వీడియోల ద్వారా మెసేజ్ ఇస్తూ జనాలను చైతన్యం చేసే ప్రయత్నం చేశారు. అయితే వారందరూ చేయని విధంగా పూనమ్ పాండే ముందుకొచ్చారు. ఈ రకమైన పబ్లిసిటీ ద్వారా తన ఇమేజ్ పూర్తిగా డ్యామేజీ అవుతుందనే విషయాన్ని పక్కన పెట్టి మరీ పూనమ్ పాండే చేసిన పనిని ఖచ్చితంగా అభినందించాలి. క్యాన్సర్ వల్ల కుటుంబంలోని వ్యక్తిని కోల్పోతే ఆ బాధ ఎలా ఉంటుందో తెలియజేయడానికి.. ఆ పరిస్థితి రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని పాండే చేసిన స్టంట్ ఖచ్చితంగా అనేకమందికి ఉపయోగపడుతుంది. ఏది ఏమైనా పాండే బ్రతికే ఉందని తెలిసి సంతోషించిన వారు.. ఆమె చేసిన పనిని కూడా మెచ్చుకుంటున్నారు.