కాంబో కుదిరింది : పవన్ 26 ఫిక్స్

ప‌వ‌ర్‌ స్టార్ ప‌వ‌న్‌ క‌ల్యాణ్ 26వ సినిమాను అధికారికంగా ప్రకటించింది మూవీ యూనిట్..

  • Published By: sekhar ,Published On : November 2, 2019 / 08:41 AM IST
కాంబో కుదిరింది : పవన్ 26 ఫిక్స్

Updated On : November 2, 2019 / 8:41 AM IST

ప‌వ‌ర్‌ స్టార్ ప‌వ‌న్‌ క‌ల్యాణ్ 26వ సినిమాను అధికారికంగా ప్రకటించింది మూవీ యూనిట్..

ప‌వ‌ర్‌ స్టార్ ప‌వ‌న్‌ క‌ల్యాణ్ అభిమానులకు శుభవార్త.. పవన్ నటించనున్న కొత్త సినిమాకు సంబంధించిన అప్ డేట్ వచ్చింది. బాలీవుడ్ చిత్రం ‘పింక్‌’ను తెలుగులో రీమేక్ చేయనున్నారు. ఈ విష‌యాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్ర‌క‌టించింది. బాలీవుడ్‌లో అమితాబ్ చేసిన లాయ‌ర్ పాత్ర‌లో ప‌వ‌న్‌ క‌ల్యాణ్ న‌టించ‌నున్నారు.

పవన్ నటిస్తున్న 26వ సినిమా ఇది. తమిళ్‌ రీమేక్ ‘నేర్కొండపార్వై’లో ‘తల’ అజిత్ కుమార్ నటించగా.. సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే.. హిందీ, తమిళ్‌లో ‘పింక్’ చిత్రాన్ని నిర్మించిన బాలీవుడ్ నిర్మాత బోనీక‌పూర్‌, తెలుగులో దిల్‌రాజుతో కలిసి నిర్మిస్తున్నారు. ‘ఓ మై ఫ్రెండ్‌’, ‘ఎంసీఏ’ చిత్రాల ద‌ర్శ‌కుడు వేణు శ్రీరామ్ సినిమాను డైరెక్ట్ చేయ‌న్నారు.

2018లో విడుద‌లైన ‘అజ్ఞాత‌వాసి’ త‌ర్వాత ప‌వ‌న్‌ క‌ల్యాణ్ మ‌ళ్లీ సినిమాల్లో న‌టించ‌లేదు. ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లో పాల్గొన్నారు. కొంత విరామం తర్వాత ముఖానికి మేకప్ వేసుకోనున్నాడు పవర్ స్టార్.. పూర్తి వివరాలు త్వరలో ప్రకటించనున్నారు.