రాధే శ్యామ్ ఫస్ట్ లుక్: పెద్ద థ్యాంక్స్ చెబుతున్న డార్లింగ్

రాధే శ్యామ్ ఫస్ట్ లుక్: పెద్ద థ్యాంక్స్ చెబుతున్న డార్లింగ్

Updated On : July 11, 2020 / 8:36 PM IST

లాక్‌డౌన్ 3నెలల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ పండుగ చేసుకునే ఆఫర్.. బాహుబలి, సాహోలు లాంటి భారీ బడ్జెట్ సినిమాల తర్వాత ఎటువంటి సినిమా వస్తుందా అని ఎదురుచూసిన అభిమానులకు తీపి కబురు చెప్పాడు డార్లింగ్. తర్వాతి సినిమా రాధేశ్యామ్ ఫస్ట్ లుక్ ను విడుదల చేసిన సినిమా యూనిట్.. ఇప్పటికే జార్జియాలో సినిమా షూటింగ్ మొదలుపెట్టి లాక్‌డౌన్ కారణంగా షెడ్యూల్ మధ్యలోనే ఆపేశారు. ఈ సినిమా ప్రొడక్షన్ హౌజ్ ముందుగా అప్‌డేట్స్ ఇవ్వడానికి నిరాకరించినా అద్భుతమైన ఫస్ట్ లుక్ విడుదల చేసి ఫ్యాన్స్ లో ఫుల్ జోష్ నింపేశారు.

ఎదురుచూపుల తర్వాత అభిమానుల కళ్ల పండుగగా అనిపించిన ఫస్ట్ లుక్ #Prabhas20, #RadheShyamFirstLook హ్యాష్ ట్యాగ్ లతో ట్రెండింగ్ అయింది. 24 గంటల్లో 6.3మిలియన్ రీ ట్వీట్లు పోయింది. దీనిపై డార్లింగ్ అభిమానులు పెద్ద థ్యాంక్స్ చెప్పాడు. పూజా హెగ్దే, ప్రొడ్యూసర్, సినిమా బ్యానర్, డైరక్టర్ లకు ట్యాగ్ చేస్తూ చేసిన పోస్టు వైరల్ అయింది.

ఈ ఫస్ట్ లుక్ ను ప్రభాస్ తో పూజా కూడా షేర్ చేశారు. కొత్తగా రిలీజ్ చేసిన పోస్టర్లో పూజా, ప్రభాస్ లు వేరే కాలం నాటి డ్రెస్ లతో కనిపిస్తున్నారు. రాధే శ్యామ్ తెలుగు, మళయాళం, తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కనుంది. పీరియాడిక్ లవ్ స్టోరీతో తెరకెక్కించనున్నారు. ఇందులో భాగ్య శ్రీ, ప్రియదర్శి, ముర్లీ శర్మ, సచిన్ ఖేడేకర్, సాషా ఛెత్రి, కునాల్ రాయ్ కపూర్, సత్యాన్ లు ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.