Actor Madhavan : బెంగళూరు ఎయిర్ పోర్టుపై మాధవన్ ట్వీట్.. స్పందించిన ప్రధాని మోడీ

బెంగళూరు కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్‌పై నటుడు మాధవన్ ప్రశంసలు కురిపించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో మాధవన్ పెట్టిన పోస్టుపై ప్రధాని మోడీ స్పందించారు.

Actor Madhavan : బెంగళూరు ఎయిర్ పోర్టుపై మాధవన్ ట్వీట్.. స్పందించిన ప్రధాని మోడీ

Actor Madhavan

Updated On : September 17, 2023 / 12:09 PM IST

Actor Madhavan : బెంగళూరు ఎయిర్ పోర్ట్‌లోని మౌలిక సదుపాయాలపై నటుడు మాధవన్ ప్రశంసలు కురిపించారు. మాధవన్ ట్వీట్‌పై ప్రధానమంత్రి మోడీ స్పందించారు.

Madhavan : ఏకంగా ఫ్రాన్స్ ప్రెసిడెంట్, మోదీలతో సెల్ఫీ తీసుకున్న మాధవన్.. మోదీ ఫ్రాన్స్ టూర్‌లో మాధవన్ స్పెషల్ అట్రాక్షన్..

నటుడు, రైటర్, డైరెక్టర్ ఆర్.మాధవన్ ఇటీవల బెంగళూరులోని కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో (KIA) కొత్తగా తెరిచిన టెర్మినల్‌లోని మౌలిక సదుపాయాలపై ప్రశంసలు కురిపించారు. విదేశాల్లో ఉన్న ఫీలింగ్ కలిగిందంటూ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో (actormaddy) పోస్టు పెట్టారు. ‘నేను కొత్త కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉన్నాను. విదేశాల్లో ఉన్న ఫీలింగ్ కలుగుతోంది.. ఎవరు నమ్మలేరు ఇది విమానాశ్రయం అంటే. భారతదేశంలో మౌలిక సదుపాయాలు చూస్తుంటే నమ్మశక్యం కావడం లేదు. ఎయిర్‌పోర్ట్‌లో వేలాడుతున్న మొక్కలు అన్నీ నిజమైన మొక్కలు. పైన ఇంకా నిర్మాణాలు చేసారు.. అన్నీ అద్భుతంగా ఉన్నాయి’ అంటూ వీడియోలో వాటిని చూపించారు.

Vedaant : మరోసారి వార్తల్లో మాధవన్ తనయుడు.. మలేషియన్ ఛాంపియన్‌షిప్ లో ఏకంగా 5 గోల్డ్ మెడల్స్

‘బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం. అత్యుత్తమమైనది. మౌలిక సదుపాయాలు ప్రపంచంలోనే అత్యుత్తమమైనవి.. చాలా గర్వంగా ఉంది’ అనే శీర్షికతో మాధవన్ పోస్ట్ చేసారు. మాధవన్ పోస్టుపై ప్రధాని మోడీ స్పందించారు. ‘భారతదేశ వృద్ధికి నెక్స్ట్ జెన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్’ అని ప్రధాని మోడీ రిప్లై చేసారు. విదేశీ విమానాశ్రయాల కంటే భారతీయ విమానాశ్రయాలు చాలా మెరుగ్గా ఉన్నాయంటూ నెటిజన్లు సైతం కామెంట్లు పెట్టారు.

 

View this post on Instagram

 

A post shared by R. Madhavan (@actormaddy)