Prithviraj : ‘సలార్’ సినిమాని ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్‌’తో పోల్చిన పృథ్విరాజ్ సుకుమారన్

భారీ అంచనాలతో డిసెంబర్ 22 న విడుదలవుతోంది 'సలార్' మూవీ. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్లు మొదలుపెట్టింది టీం. ఈ సినిమాలో కీలకపాత్ర పోషిస్తున్న పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ ఈ సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. 

Prithviraj : ‘సలార్’ సినిమాని ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్‌’తో పోల్చిన పృథ్విరాజ్ సుకుమారన్

Prithviraj

Updated On : December 16, 2023 / 7:04 PM IST

Prithviraj :  పాన్ ఇండియా స్టార్ ప్రభాస్,  స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో భారీ అంచనాలతో వస్తున్న ‘సలార్’ మూవీకి కౌంట్ డౌన్ స్టార్టైంది. ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న మళయాళ హీరో పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు.

Bhagyashri Borse : మాస్ మహారాజా కా క్లాస్ మహారాణి వ‌చ్చేసింది.. ఎవ‌రో తెలుసా..?

ప్రభాస్-ప్రశాంత్ నీల్  కాంబినేషన్‌లో వస్తున్న ‘సలార్’ డిసెంబర్ 22 న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతోంది. ఈ మూవీ టీం ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో ఎలాంటి హైలైట్స్ ఉన్నాయా? అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. కాగా ఈ సినిమాలో విలన్‌గా నటిస్తున్న మళయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ సినిమా గురించి మాట్లాడారు.

సలార్ సినిమాలో ప్రభాస్- పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ బెస్ట్ ఫ్రెండ్స్‌గా నటిస్తున్నారు. ఇందులో పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ వరదరాజ్ మన్నార్ పాత్రలో కనిపించనున్నారు. అయితే ప్రభాస్ దేవుడిలా కనిపిస్తారని, ఈ సినిమాలో నటించడం తన అదృష్టమని అన్నారు పృథ్వీరాజ్‌. ఇలాంటి స్టోరీ తన కెరియర్‌లో చూడలేదని, ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందని తాను నమ్ముతున్నానని చెప్పారు. ప్రభాస్ తన చుట్టూ ఉండేవారికి ఆనందం పంచుతారని సెట్స్‌లో ప్రభాస్‌ను అందరూ ఇష్టపడతారని అందకే డార్లింగ్ అని పిలుస్తారని పృథ్వీరాజ్‌ చెప్పారు.

Suma Kanakala : ఆ షో కోసం యాంకర్ కట్టుకున్న చీరలు ఎన్నో తెలిస్తే షాకవుతారు

ఇంకా ఈ సినిమాను పృథ్వీరాజ్‌ హాలీవుడ్‌లో సంచలనం రేపిన సిరీస్ ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ తో పోల్చారు. ఈ సినిమాలో భారీ యాక్షన్ ఎలిమెంట్స్ ఉంటాయని కూడా చెప్పారు. అందరూ సలార్ సినిమా ‘కేజీఎఫ్’ సినిమాను పోలి ఉంటుందని భావిస్తున్నారు కానీ అంతకు మించి ఉంటుందని వెల్లడించారు పృథ్వీరాజ్‌ సుకుమారన్‌. ఇప్పటివరకు సలార్ సినిమాతో బిజీగా ఉన్న పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ ‘L2E’ , ది గోట్ ఆఫ్ లైఫ్ సినిమాలతో పాటు బడే మియా చోటే మియా అనే హిందీ సినిమాలు చేస్తున్నారు.