Priyanka Chopra : సిటాడెల్ లో ప్రియాంక చోప్రా న్యూడ్ సీన్స్.. మరి ఇండియన్ వర్షన్ లో సమంత?

గత కొన్ని రోజులుగా సిటాడెల్ యూనిట్ ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు. ఇటీవలే లండన్ లో ప్రీమియర్ వేయగా అనేకమంది సినీ ప్రముఖులు హాజరయ్యారు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ప్రియాంక చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

Priyanka Chopra : సిటాడెల్ లో ప్రియాంక చోప్రా న్యూడ్ సీన్స్.. మరి ఇండియన్ వర్షన్ లో సమంత?

Priyanka Chopra acted in intimate scenes in Citadel and will do samantha same in India Citadel?

Updated On : April 20, 2023 / 7:34 AM IST

Priyanka Chopra : బాలీవుడ్(Bollywood) లో స్టార్ హీరోయిన్ అయిన తర్వాత హాలీవుడ్(Hollywood) చెక్కేసింది ప్రియాంక చోప్రా(Priyanka Chopra). అక్కడే వరుస సినిమాలు చేస్తూ నిక్ జోనస్(Nick Jonas) ని పెళ్లి చేసుకొని హాలీవుడ్ లోనే సెటిల్ అయిపోయింది ప్రియాంక. త్వరలో ప్రియాంక చోప్రా, రిచర్డ్ మాడెన్(Richard Madden) తో కలిసి సిటాడెల్(Citadel) సిరీస్ తో అమెజాన్(Amazon) లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సస్పెన్స్, థ్రిల్లింగ్ అంశాలతో సాగే సిటాడెల్ సిరీస్ ఏప్రిల్ 28 నుంచి అమెజాన్ లో స్ట్రీమింగ్ కాబోతుంది.

గత కొన్ని రోజులుగా సిటాడెల్ యూనిట్ ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు. ఇటీవలే లండన్ లో ప్రీమియర్ వేయగా అనేకమంది సినీ ప్రముఖులు హాజరయ్యారు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ప్రియాంక చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ప్రియాంక మాట్లాడుతూ.. సిటాడెల్ సిరీస్ లో పలు బోల్డ్ సీన్స్ కూడా చేశాం. రిచర్డ్ తో అసౌకర్యంగా కొన్ని యాంగిల్స్ లో కూడా నటించాల్సి వచ్చింది. అప్పుడు మా బాడీ పార్ట్స్ కెమెరాలో స్పష్టంగా కనిపించకుండా కవర్ చేసుకున్నాం. ఈ విషయంలో రిచర్డ్ కూడా నాకు సపోర్ట్ ఇస్తూ, సీన్ చేసేటప్పుడు అక్కడ కవర్ చేసుకో.. ఇక్కడ చేయి అడ్డం పెట్టుకో అని చెప్పేవాడు. మా ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉండటంతో ఆ బోల్డ్ సీన్స్ లో ఇబ్బంది లేకుండా నటించాం అని తెలిపింది. దీంతో చాలా హాలీవుడ్ సిరీస్ లలో ఉన్నట్టే ఇందులో కూడా బోల్డ్, అడల్ట్ సీన్స్ ఉన్నాయని, ప్రైవేట్ పార్ట్స్ కవర్ చేస్తూ ప్రియాంక న్యూడ్ సీన్స్ కూడా చేసిందని తెలుస్తుంది.

Ram Charan : ఉపాసన డెలివరీ అయ్యేవరకు చరణ్ షూటింగ్స్ కు బ్రేక్ ఇస్తాడా??

అయితే ఇదే సిరీస్ ని సమంత, వరుణ్ ధావన్ లతో ఇండియన్ వర్షన్ తెరకెక్కిస్తున్నారు. ఫ్యామిలీ మ్యాన్ దర్శకులు రాజ్ & డీకే ఇండియన్ వర్షన్ సిటాడెల్ ని తెరెక్కిస్తున్నారు. మరి ఇందులో సమంత ఆ రేంజ్ లో బోల్డ్ సీన్స్ చేస్తుందా? ప్రియాంక లాగే న్యూడ్ గా నటిస్తుందా అనే అనుమానాలు వస్తున్నాయి. విడాకుల తర్వాత సమంత పుష్ప సినిమాలో ఐటెం సాంగ్ చేసిన సంగతి తెలిసిందే. అప్పుడే సమంతపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అయినా సమంత లెక్క చేయలేదు. విడాకుల ముందు ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ లో కూడా బోల్డ్ సీన్స్ కొన్ని చేసింది. మరి ఇప్పుడు సిటాడెల్ లో కూడా బోల్డ్ సీన్స్ హాలీవుడ్ రేంజ్ లో చేస్తుందా సమంత అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. తెలియాలంటే సిరీస్ వచ్చేదాకా వెయిట్ చేయాల్సిందే.