Pushpa 2 : పుష్ప 2లో ఐటెం సాంగ్ ఉందా?? ఈ సారి సమంత ప్లేస్ లో ఎవరు?

పుష్ప సెకండ్ పార్ట్ లో కూడా ఐటెమ్ సాంగ్ ఎంతో ప్రత్యేకంగా ఉండబోతుందని తెలుస్తోంది. ఇప్పుడు రెండో పార్టులో అంతకుమించిన పాట, అంతకుమించిన అందం ఉండాలి. ప్రస్తుతం చిత్రబృందం ఈ పనిలోనే బిజీగా ఉన్నారట.

Pushpa 2 : పుష్ప 2లో ఐటెం సాంగ్ ఉందా?? ఈ సారి సమంత ప్లేస్ లో ఎవరు?

Pushpa 2 Item song plans bigger than samantha oo antava oo oo antava song

Updated On : April 13, 2023 / 12:19 PM IST

Pushpa 2 :  అల్లు అర్జున్(Allu Arjun) – సుకుమార్(Sukumar) – దేవిశ్రీ ప్రసాద్(Devi Sri Prasad) కాంబో అంటే సూపర్ హిట్ ఐటెం సాంగ్(Item Song)) ఉంటుంది అని ప్రేక్షకులు అంచనా వేస్తారు. వారి అంచనాలకు తగ్గట్టే ఈ కాంబోలో వచ్చిన ఐటెం సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి. ‘పుష్ప’(Pushpa) మూవీ ఫస్ట్ పార్ట్ ఐటెమ్ సాంగ్ లో సమంత(Samantha), అల్లు అర్జున్ తో కలిసి ఊ అంటావా మావా.. ఉఊ అంటావా మావా అంటూ అలరించడంతో ఈ పాట బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ప్రపంచవ్యాప్తంగా ఈ పాట, స్టెప్పులు వైరల్ అయ్యాయి. చాలా గ్యాప్ తర్వాత సమంత ఓ రేంజ్ లో అందాలని ఆరబోస్తూ స్టెప్పులు వేయడంతో కుర్రకారు కిర్రెక్కిపోయారు. సినిమా గ్రాండ్ సక్సెస్ లో ఆ సాంగ్ పాత్ర కూడా చాలానే ఉంది.

అందుకే పుష్ప సెకండ్ పార్ట్ లో కూడా ఐటెమ్ సాంగ్ ఎంతో ప్రత్యేకంగా ఉండబోతుందని తెలుస్తోంది. ఇప్పుడు రెండో పార్టులో అంతకుమించిన పాట, అంతకుమించిన అందం ఉండాలి. ప్రస్తుతం చిత్రబృందం ఈ పనిలోనే బిజీగా ఉన్నారట. సూపర్ హిట్ ఐటెమ్‌ సాంగ్‌ కుదరడం ఎంత కష్టమో, దానికి తగ్గ హీరోయిన్‌, అందులోనూ స్టార్‌ హీరోయిన్‌ దొరకడం ఇంకా కష్టం.

‘పుష్ప 2’లో కూడా ఐటెమ్ సాంగ్ కోసం సుకుమార్ మళ్లీ సమంతనే అప్రోచ్ అయ్యాడని వార్తలొచ్చినా సామ్ ఆ వార్తల్ని ఖండించింది. ఆల్రెడీ సమంతతో ఒక సాంగ్ తీశారు కాబట్టి ఈ సారి ఇంకో హీరోయిన్ ని పెట్టి మరింత పాపులారిటీ సినిమాకు తేవాలని చూస్తున్నాడు సుకుమార్. ఇప్పుడు బాలీవుడ్ మార్కెట్ ని కూడా గట్టిగా టార్గెట్ చేయడంతో కాజల్ అగర్వాల్, మలైకా అరోరా, తమన్నా లాంటి బ్యూటీస్ పేర్లు, మరికొంతమంది బాలీవుడ్ భామల పేర్లు వినిపిస్తున్నాయి. మరి సుకుమార్ ఈ సారి ఐటెమ్ సాంగ్ కోసం ఎవరిని సెలెక్ట్ చేస్తారో చూడాలి.

Samyuktha Menon : టాలీవుడ్ లో ఎంట్రీతోనే హ్యాట్రిక్.. వరుస అవకాశాలు పట్టేస్తున్న మలయాళీ కుట్టి..

ఇక ఏ స్టార్ హీరోయిన్ ని తీసుకున్నా దేవీశ్రీ ప్రసాద్ మాత్రం ఈ సారి ఊ అంటావా ఉఊ అంటావా మ్యాజిక్ కు మించి ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయి. పుష్ప 2లో ఈ సారి ఐటెం సాంగ్ మరింత గ్రాండియర్ గా ఉండబోతుందని వార్తలు వస్తుండటంతో అభిమానులు, ప్రేక్షకులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే రిలీజైన పుష్ప గ్లింప్స్, పోస్టర్ తో సినిమాపై భారీ హోప్స్ ఉండటంతో, ఐటెం సాంగ్ కూడా ఊ అంటావాకు మించి ఉంటుందని అంతా భావిస్తున్నారు. మరి పుష్ప 2 ఐటెం సాంగ్ లో ఏ భామ మెరుస్తుందో చూడాలంటే వెయిట్ చేయాల్సిందే.