‘సినిమా నా ఆశ, శ్వాస’ – మహేశ్ చేతుల మీదుగా ట్రైలర్ రిలీజ్

సూపర్ స్టార్ మహేష్ బాబు చేతుల మీదుగా ‘రఘుపతి వెంకయ్య నాయుడు’ థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్..

  • Published By: sekhar ,Published On : November 9, 2019 / 07:06 AM IST
‘సినిమా నా ఆశ, శ్వాస’ – మహేశ్ చేతుల మీదుగా ట్రైలర్ రిలీజ్

Updated On : November 9, 2019 / 7:06 AM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు చేతుల మీదుగా ‘రఘుపతి వెంకయ్య నాయుడు’ థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్..

తెలుగు సినిమా అభ్యున్నతికి విశేష సేవలు అందించిన పితామహుడు, ఫాదర్ ఆఫ్ ది సౌత్ ఇండియన్ సినిమాగా కీర్తిగడించిన రఘుపతి వెంకయ్య గారి జీవితం ఆధారంగా తెరకెక్కిన సినిమా ‘రఘుపతి వెంకయ్య నాయుడు’.. ఎల్లో లైన్ పిక్చర్స్ బ్యానర్ పై, యువ దర్శకుడు బాబ్జి తెరకెక్కించిన ఈ సినిమాలో ప్రధాన పాత్రను సీనియర్ నటులు నరేష్ పోషించగా, తణికెళ్ల భరణి, మహర్షి, వాహిని, సత్య ప్రియ, భావన, శక్తిమాన్‌, అఖిల్‌ సన్నీ, మునిచంద్ర, సాయికాంత్‌, చాణక్య, దేవరాజ్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు.

శనివారం ‘రఘుపతి వెంకయ్య నాయుడు’ థియేట్రికల్ ట్రైలర్ సూపర్ స్టార్ మహేష్ బాబు చేతుల మీదుగా విడుదలైంది.. ‘మీ బాబు బొమ్మలా ఉన్నాడు కదండీ.. కాదు.. బొమ్మల్ని ఆడించేవాడిలా ఉన్నాడు’ అంటూ వెంకయ్య నాయుడి జననం సినిమాతో ముడిపడి ఉన్నట్టు చెప్పడంతో ప్రారంభమైన ట్రైలర్ ఆసక్తి కరంగా ఉంది..

Read Also : ‘చెహరే’ పోస్ట్‌పోన్ – ఏప్రిల్ 24 విడుదల

‘ఈ లైట్ల వెలుగు పడినంత కాలమే ఏ సినిమా వాడైనా వెలుగులో ఉంటాడు’.. ‘ఏ రోజుకైనా సినిమాయే ఈ ప్రపంచాన్ని మారుస్తుంది.. సినిమాయే ఈ ప్రపంచాన్ని శాసిస్తుంది’.. ‘సినిమా అంటే ప్రపంచానికి రాసే ప్రేమలేఖ.. సినిమా అంటే ప్రజల గుండెల్లో గీసే చిత్ర రేఖ’.. ‘సినిమా నా ఆశ, సినిమా నా శ్వాస’.. వంటి డైలాగులు ఆకట్టుకున్నాయి.. నరేష్, వెంకయ్య నాయుడి పాత్రలో ఒదిగిపోయారు.. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ‘రఘపతి వెంకయ్య నాయుడు’ చిత్రం నవంబర్ 29న విడుదల కానుంది..