Akhil Akkineni : అఖిల్ కోసం వస్తున్న రాజమౌళి.. అయ్యగారు ఈ సారైనా హిట్ కొడతారా?

ఏజెంట్ సినిమా తర్వాత యూవీ క్రియేషన్స్ లో మళ్ళీ భారీ బడ్జెట్ తో కొత్త దర్శకుడు అనిల్ దర్శకత్వంలో అఖిల్ నెక్స్ట్ ప్రాజెక్ట్ తెరకెక్కనుంది.

Akhil Akkineni : అఖిల్ కోసం వస్తున్న రాజమౌళి.. అయ్యగారు ఈ సారైనా హిట్ కొడతారా?

Rajamouli and Karthikeya helps to Akhil Akkineni Next Movie for giving Hit to Akhil

Updated On : September 26, 2023 / 11:40 AM IST

Akhil Akkineni :  అక్కినేని వారసుడు అఖిల్ కి క్రేజ్ ఎంత ఉన్నా సినిమా హిట్ మాత్రం రావట్లేదు. మొదటి సినిమా నుంచి చాలా కష్టపడుతున్నా సరైన విజయం మాత్రం దక్కట్లేదు. మొదటి సినిమానే పరాజయం పాలయి నిరాశ మిగిల్చింది అఖిల్ కి. ఆ తర్వాత వచ్చినా హలో, మిస్టర్ మజ్ను సినిమాలు కూడా యావరేజ్ గానే నిలిచినా కమర్షియల్ సక్సెస్ అవ్వలేదు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా మాత్రం పర్వాలేదనిపించింది.

ఇక ఆ తర్వాత భారీ అంచనాలతో, మమ్ముట్టి లాంటి స్టార్ హీరోని కూడా పెట్టి స్పై యాక్షన్ థ్రిల్లర్ సినిమా అంటూ అఖిల్ రేంజ్ కి 5 రెట్ల భారీ బడ్జెట్ తో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఏజెంట్ సినిమా వచ్చింది. సినిమా రిలీజ్ కి ముందు భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కాని ఏజెంట్(Agent) సినిమా డిజాస్టర్ లా మిగిలింది. దీంతో అక్కినేని అభిమానులు నిరాశ చెందారు. ఏజెంట్ సినిమా తర్వాత అఖిల్ పై భారీగా ట్రోల్స్ కూడా వచ్చాయి.

అఖిల్ ఒక మంచి హిట్ ఎప్పుడు కొడతాడా అని అభుమానులు ఎదురు చూస్తున్నారు. ఏజెంట్ సినిమా తర్వాత యూవీ క్రియేషన్స్ లో మళ్ళీ భారీ బడ్జెట్ తో కొత్త దర్శకుడు అనిల్ దర్శకత్వంలో అఖిల్ నెక్స్ట్ ప్రాజెక్ట్ తెరకెక్కనుంది. అధికారికంగా అనౌన్స్ చేయకపోయినా ఈ విషయం బయటకి వచ్చి అందరికి తెలిసింది. అయితే తాజాగా అఖిల్ నెక్స్ట్ సినిమాపై మరో ఆసక్తికర విషయం వినిపిస్తుంది.

Also Read : Mangalavaaram : శుక్రవారం రానున్న ‘మంగళవారం’.. RX 100 డైరెక్టర్ నెక్స్ట్ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్..

యూవీ నిర్మాణంలో అనిల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న అఖిల్ సినిమా స్క్రిప్ట్ కి దర్శక ధీరుడు రాజమౌళి, ఆయన తనయుడు కార్తికేయ సహాయం తీసుకోబోతున్నారట. అఖిల్ నెక్స్ట్ సినిమాకు రాజమౌళి, కార్తికేయ సూపర్ విజన్ చేయనున్నట్టు సమాచారం. దీంతో రాజమౌళి కూడా ఈ స్క్రిప్ట్ ని సరిదిద్దే పనిలో పడ్డారు. రాజమౌళి చెయ్యి పడిన తర్వాత ఈ సారైనా అయ్యగారు హిట్ కొడతారని అని అభిమానులు భావిస్తున్నారు.