Rajamouli – Sri Simha Marriage : సైలెంట్ గా పెళ్లి చేసేసుకున్న యువ హీరో.. పెళ్లిలో రాజమౌళి మాస్ డ్యాన్స్.. వీడియోలు చూశారా?

శ్రీ సింహ పెళ్ళిలో రాజమౌళి రచ్చ చేసారు. మాస్ డ్యాన్సులతో అదరగొట్టేసాడు.

Rajamouli – Sri Simha Marriage : సైలెంట్ గా పెళ్లి చేసేసుకున్న యువ హీరో.. పెళ్లిలో రాజమౌళి మాస్ డ్యాన్స్.. వీడియోలు చూశారా?

Rajamouli Mass Dances in Hero Sri Simha Marriage Videos goes Viral

Updated On : December 16, 2024 / 10:04 AM IST

Rajamouli – Sri Simha Marriage : కీరవాణి చిన్న కొడుకు, హీరో శ్రీ సింహకు ఇటీవల సీనియర్ నటుడు మురళీమోహన్ మనవరాలు రాగతో నిశ్చితార్థం జరగ్గా నిన్న డిసెంబర్ 15న వారి వివాహం జరిగినట్టు తెలుస్తుంది. శ్రీ సింహ – రాగ పెళ్లి కేవలం ఇరు కుటుంబాలు, సన్నిహితుల మధ్య సైలెంట్ గా చేసేసినట్టు సమాచారం. ఈ పెళ్లి నుంచి అధికారికంగా ఫోటోలు, వీడియోలు ఎవ్వరూ ఇంకా రిలీజ్ చేయకపోయినా కొన్ని పెళ్లి ఫోటోలు, వీడియోలు లీక్ అయి వైరల్ గా మారాయి. దీంతో కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Also Read : Keerthy Suresh : క్రిస్టియన్ పద్దతిలో కీర్తి సురేష్ మళ్ళీ పెళ్లి.. ఫోటోలు చూశారా? భర్తతో లిప్ కిస్ ఫొటో వైరల్..

అయితే శ్రీ సింహకు రాజమౌళి బాబాయ్ అవుతారని తెలిసిందే. దీంతో శ్రీ సింహ పెళ్ళిలో రాజమౌళి రచ్చ చేసారు. మాస్ డ్యాన్సులతో అదరగొట్టేసాడు. సంగీత్ లో భార్యతో కలిసి అదిరిపోయే డ్యాన్స్ వేసిన రాజమౌళి, పెళ్ళిలో శ్రీ సింహ అన్న, మ్యూజిక్ డైరెక్టర్ కాలభైరవ, మరికొంతమంది బంధువులతో కలిసి మాస్ డ్యాన్సులు వేసి అదరగొట్టారు. దీనికి సంబంధించిన వీడియోలు లీక్ అయి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఈ వీడియోల్లో రాజమౌళి మాస్ డ్యాన్స్ చూసి అభిమానులు, నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. దేశం గర్వపడేలా సినిమాలు తీసే రాజమౌళిలో ఈ ట్యాలెంట్ కూడా ఉందా అని ఆశ్చర్యపోతున్నారు.