సూపర్ స్టార్ ‘దర్బార్’ ఫస్ట్ లుక్ రిలీజ్

సూపర్ స్టార్ రజనీకాంత్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇటీవల పేటగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన రజనీ మరో సినిమాను పట్టాలెక్కిస్తున్నాడు. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తన తదుపరి చిత్రం చేయనున్నాడు. రజినీ, మురుగదాస్ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రానికి దర్బార్ టైటిల్ ఫిక్స్ చేస్తూ ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు చిత్ర యూనిట్.
ఈ చిత్రం యొక్క షూటింగ్ ఏప్రిల్ 10 నుండి స్టార్ట్ కానుంది. ముంబై బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనున్న ఈ చిత్రంలో రజినీ పోలీస్ ఆఫిసర్ గా నటించనుండగా ఆయనకు జోడిగా లేడీ సూపర్ స్టార్ నయనతార నటించనుంది. అనిరుద్ సంగీతం అందించనున్న ఈ చిత్రాన్నీ లైకా ప్రొడక్షన్స్ నిర్మించనుంది. ఈ చిత్రం 2020 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
“YOU DECIDE WHETHER YOU WANT ME TO BE GOOD OR BAD OR WORSE” అంటూ పోస్టర్‌పై రాసి ఉండటాన్ని బట్టి చూస్తే రజినీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుందో అని అసక్తి కలుగుతుంది.